దొంగలు... రెచ్చిపోయారు


Sun,October 21, 2018 12:11 AM

కూకట్‌పల్లి, (నమస్తే తెలంగాణ): పట్టపగలే ఓ ఇంట్లో దొంగపడి చోరీకి పాల్పడ్డాడు. గృహిణి ఉండగానే.. బీరువాలోని 6.5తులాల ఆభరణాలను తీసుకొని పరారయ్యా డు. దొంగను పట్టుకునేందుకు యత్నించిన గృహిణికి గా యాలయ్యాయి. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితురాలి కథ నం ప్రకారం... కూకట్‌పల్లి సర్కిల్, సప్తగిరి కాలనీలో కామేశ్వర్‌రావు, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కామేశ్వర్‌రావు ఉద్యోగానికి వెళ్లగా, కవిత వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి, అనంతరం వంట చేస్తుంది. ఈ క్రమంలో బెడ్ రూంలో ఏదో శబ్ధం వినపడింది. లోనికి వెళ్లి చూడగా ... గుర్తు తెలియని వ్యక్తి బీరువాను ఓపెన్‌చేసి బంగారు ఆభరణాలు ఉన్న బాక్స్ తీసుకుంటున్నాడు. అతన్ని పట్టుకునేందుకు యత్నించగా ఆమెను తోసేసి పరారయ్యాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా... దొంగ దాడిలో కవిత తలకు తీవ్ర గాయమైంది.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...