శ్రీగంధం చెట్లతో అధిక లాభాలు


Sun,October 21, 2018 12:09 AM

-ఉద్యానవనశాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి
అబిడ్స్,నమస్తే తెలంగాణ : శ్రీ గంధం తోటల గురించి రైతులు అవగాహన పొందాల్సిన అవసరం ఉన్నదని ఉద్యానవనశాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని ఉద్యానవనశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని రైతు క్షేత్రాల్లో ఇటీవల శ్రీగంధం తోటలను సందర్శించినట్లు తెలిపారు. నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో శ్రీగంధం తోటలు పెంచేందుకు అనువైన ప్రాంతాలున్నాయని చెప్పారు. 15 సంవత్సరాల తరువాత ఒక్కో చెట్టుకు మూడు లక్షలకు పైగా ఆదాయం వస్తుందని, ఎకరంలో 300 నుంచి 400 మొక్కలు పెంచుకుంటే కోటి రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఉద్యానశాఖ నుంచి నాణ్యమైన శ్రీగంధం మొక్కలను తక్కువ ధరలకు రైతులకు సరఫరా చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, యాదాద్రి ఏడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

191
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...