24 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు


Sun,October 21, 2018 12:08 AM

-నవంబర్ 10 వరకు ఎస్సెస్సీ, ఇంటర్ వారికి
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమయ్యింది. ఈనెల 24 నుంచి నవంబర్ 10 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యార్థుల కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా,3301 మంది విద్యార్థులు, ఎస్సెస్సీ వారి కోసం 26 కేంద్రాలను ఏర్పాటు చేయగా 7046 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
సజావుగా నిర్వహించండి : అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పూర్ణచందర్‌రావు ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, నిరంతర విద్యుత్తు, బందోబస్తు ఇతర సదుపాయాలు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు సరిపోయేలా ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈవో రవికుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఏసీపీ భిక్షంరెడ్డి, డీఈ లక్ష్మీనారాయణ, ఇంటర్ బోర్డ్ సూపరింటెండెంట్ శ్రీనాథ్, వాటర్‌వర్క్స్ ప్రతినిధి విజయారావు, ఆర్డీసీ డీవీఎం సుధా పరిమళ, డీఎంహెచ్‌వో నుంచి రాములు తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...