నాగోలు బ్రిడ్జి కింద రౌడీషీటర్ మృతదేహం


Sun,October 21, 2018 12:07 AM

ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : యాదగిరిగుట్ట ప్రశాంత్‌నగర్ కాలనీలో హత్యకు గురైన రౌడీషీటర్ జాఫర్ మృతదేహం... చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నా గోలు బ్రిడ్జ్ కింద లభ్యమైం ది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం ఉదయం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ ప్రాంతంలో రౌడీషీటర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఈ గొడవలో తీవ్ర గాయాలకు గురైన జాఫర్‌ను నగరంలోని దవాఖానకు తర లిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని నాగోలు బ్రిడ్జికింద పడేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నిందితులు యాదగిరిగుట్ట పోలీసులకు తెలుపడంతో వారు నగర పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎల్‌బీనగర్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి నాగోలు బ్రిడ్జి ప్రాంతం లో గాలించారు. అలాగే సాయంత్రం చైతన్యపురి పోలీసులు గాలించారు. కాగా ... శనివారం ఉదయం స్థానికులు నాగోలు బ్రిడ్జ్ కింద మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నాగార్జున జాఫర్ మృతదేహాన్ని స్వాధీ నం చేసుకొని... గుట్ట పోలీసులకు సమాచారం అందించారు. గుట్ట సీఐ ఆంజనేయులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...