సరదా కోసం.. వాహనాల చోరీ

Sun,October 21, 2018 12:06 AM

పేట్‌బషీరాబాద్ : సరదా కోసం ఓ విద్యార్థి దొంగగా మారాడు. అవసరం తీరాక దొంగిలించిన వాహనాలను వదిలేయడం అతనికి మరో సరదా.. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అందె శ్రీనివాసరావు, సీఐ మహేశ్, డీఐ సంతోశతో కలిసి వివరాలు వెల్లడించా రు. మేడ్చల్ పట్టణానికి చెందిన ఓ వ్యాపార వేత్త, సీడ్స్ కంపెనీ యజమాని కుమారుడు(17) బీబీఎం చదువుతున్నాడు. మైనర్ కావడంతో తల్లిదండ్రులు అతనికి వాహనం ఇప్పించలేదు. ఎలాగైనా బైక్‌లపై రైడింగ్ చేయాలని నిర్ణయించుకుని... ఖరీదైన వాహనాలను 2017 డిసెంబర్ నుంచి దొంగిలించడం మొదలు పెట్టా డు. కొన్ని రోజులు నడిపి, సరదా తీరిన వెంటనే వాటిని వదిలేస్తు న్నాడు. అయితే శనివారం ఉదయం జీడిమెట్ల దీవాన్ దాబా వద్ద బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో 3, మేడ్చ ల్ పరిధిలో 3, తుకారాంగేట్, గౌరారం, తిరుమలగిరి పీఎస్‌ల పరిధిలో ఒకొక్క వాహనాన్ని దొంగిలించినట్లు తెలిపాడు. వీటిపై మోజు తీరిన వెంటనే బహిరంగ ప్రదేశాల్లో వదిలేసినట్లు తెలిపా డు. వీటి విలువ రూ.13 లక్షల వరకు ఉంటుందని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాలుడిని జువైనల్‌హోంకు తరలించారు.

142
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles