దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి

Sun,October 21, 2018 12:06 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ వద్ద తుంగభద్ర నదిలో దుర్గామాత నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రు తి చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అలంపూర్ ఏఎస్‌ఐ సుబ్బారెడ్డి కథనం ప్రకారం.... దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్, బోరబండ, జవల్తారావు నగర్‌లో స్థానికులు దుర్గామాతను ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేసేందుకుగానూ స్థానిక యువకులు, మహిళలు 20 మంది శనివారం డీసీఎంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌కు చేరుకున్నారు. ఆలయాల సమీపంలో తుంగభద్ర నది లో నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు సురేశ్ (26) విగ్రహంతో పాటు నదిలో పడిపోయి గల్లంతయ్యాడు. యువకుడి మృతదేహం కోసం గత ఈతగాళ్లు గాలిస్తున్నారు. సురేశ్ తండ్రి రమేశ్ ఓ హోటల్‌లో రోజు కూలీగా పని చేస్తున్నాడు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles