వాజ్‌పాయినగ్‌లోని మూడు ఇండ్లలో చోరీ


Sun,October 21, 2018 12:05 AM

పేట్‌బషీరాబాద్ : దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రాత్రి మూడు ఇండ్లల్లో దొంగలు పడి నగదు, ఆభరణాలు, సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... కుత్బుల్లాపూర్ సర్కిల్, వాజ్‌పాయినగర్, తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని ఓ ఇంట్లో 3 గదుల్లో 30 మంది కార్మికులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి పడుకున్న తర్వాత దొంగలు చొరబడి.. 30 మందికి సంబంధించిన సెల్‌ఫోన్‌లను దోచుకెళ్లారు. అలాగే ఎదురుగా ఉన్న నాగేశ్‌కుమార్ పండుగకు ఊరెళ్లగా తాళం పగులగొట్టి బీరువాలోని రూ.2 వేలు, హుండీలో ఉన్న రూ.1500 ల నగదుతో పాటు 5 తులాల వెండిని దోచుకెళ్లారు. అదే విధంగా రాజు అనే వ్యక్తి ఇంట్లోనూ పడి సెల్‌ఫోన్, విలువైన వస్తువులను తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...