నగర ఓటర్లు 77,05,305


Sat,October 20, 2018 12:53 AM

- గ్రేటర్ ఓటర్లు 77,05,305
- స్పష్టత ఇచ్చిన ఎన్నికల సంఘం
- తుది జాబితా సిద్ధం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ ఓటర్ల లెక్క తేలింది. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో 77,05,305 మంది ఓటర్లున్నట్లు శుక్రవారం ప్రకటించింది. లెక్క తేలింది.. తుది జాబితా సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు కలిపి మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో గ్రేటర్ ఓటర్లు 77, 05, 305 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తంగా ఓటు ప్రాముఖ్యత తెలిసేలా స్వచ్ఛంద సంస్థలు, బల్దియా చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో యువతలో చైతన్యం పెరిగింది.18 ఏండ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదయ్యారు. సవరణ, నమోదుల ప్రక్రియ సత్ఫలితాలివ్వడంతో ఓటర్ల సంఖ్య ఈసారి పెరగడం విశేషం.
HYD
HYD1

297
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...