నేడు సిటీలో రాహుల్ గాంధీ పర్యటన


Sat,October 20, 2018 12:45 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో నగరంలో శనివారం ఆయా ప్రాం తాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు చార్మినార్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభకు ఎస్పీ జీ రక్షణ కల్గి ఉన్న రాహుల్‌గాంధీ హాజరువుతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనాదారులు ఆయా రూట్లలో ప్రత్యామ్నాయ రూట్ల లో వెళ్లి, ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
* సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి గ్రీన్‌ల్యాండ్స్ ైప్లెవోర్, సీఎం క్యాంప్ అఫీస్ మోన్నప్ప జంక్షన్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాగం, రవీంధ్రభారతి, బీజేఆర్ విగ్రహాం, అబిడ్స్, మోహింజా మార్కె ట్, అఫ్జల్‌గంజ్, మదీనా, మూసాబౌలి, మోతీగల్లీ, లాడ్‌బజార్, చార్మినార్ వరకు ఆంక్షలు ఉంటాయి.
* రాత్రి 7 గంటల నుంచి 7.40 నిమిషాల వరకు చార్మినార్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలు ఉంటాయి.
*ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతుండడంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆయా రూట్లలో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎతేబజార్ చౌక్ నుంచి గుల్జార్ హౌస్ వైపుకు ట్రాఫిక్ అనుమతి లేదు, ఈ వాహనాలు అర్మాన్ కేఫ్ నుంచి అల్జా కోట్ల మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.
* అల్జా కోట్ల వైపు నుంచి సర్ధార్ మహల్ వైపు ట్రాఫిక్ అనుమతించరు, ఈ వాహనాలను అర్మాన్ కేఫ్ నుంచి మళ్లిస్తారు.
* ఝాన్సీ బజార్, మిట్టికా షేర్ వైపు నుంచి గుల్జార్ హౌస్ వైపు వాహనాలకు అనుమతి లేదు, ఈ వాహనాలను ఝాన్సీబజార్, ఉర్దూ గల్లీ మీదుగా మళ్లిస్తారు.
* ముర్గిచౌక్ నుంచి లాడ్ బజార్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదు, ఈ ట్రాఫిక్‌ను కిల్వత్ వైపు మళ్లిస్తారు.
* నయాపూల్, చత్తబజార్ వైపు నుంచి పత్తర్‌ఘట్టి వైపు వాహనాలను అనుమతించరు, వీటని సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు.
* శాలిబండ నుంచి చార్మినార్ వైపు ట్రాఫిక్ అనుమతి లేదు, ఈ రూట్‌లో వచ్చే వాహనాలను పంచ్ మెహల్లా నుంచి కిల్వత్ వైపు మళ్లిస్తారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...