ప్రతి గర్భిణిని కేసీఆర్ కిట్‌లో ఎంట్రీ చేయాలి


Sat,October 20, 2018 12:43 AM

శామీర్‌పేట : ప్రతి గర్భిణిని కేసీఆర్ కిట్‌లో ఎంట్రీ చేయాల్సిన బాధ్యత ఏఎన్‌ఎంలపై ఉందని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ అన్నారు. శుక్రవారం శామీర్‌పేట ఎంపీడీవో కార్యాలయంలో కేసీఆర్ కిట్ల ఆధునీకరణ, ఆన్‌లైన్ డాటా ఎంట్రీలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జేడీ మాట్లాడుతూ ఆరోగ్య రక్షగా కేసీఆర్ కిట పథకం పనిచేస్తుందని కేసీఆర్ కిట్‌లో ప్రతి గర్భిణిని పూర్తి విరాలను పొందుపరచాలని సూచించారు. ముఖ్యంగా హైరిస్క్ గర్భిణీల ను అప్‌డేట్ చేసి బర్త్ ప్లానింగ్(ఈడీడీ)పై ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, వైద్య సేవలను అందిస్తుండాలన్నారు. గర్భిణీ ఎక్కడైన ప్రసవం చేసుకోవచ్చునని ఏ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆన్‌లైన్ ద్వారా పూర్తి వివరాలను అక్కడ అందుబాటులో ఉంటాయని దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవం చేయవచ్చునన్నారు. అనంతరం జిల్లాలోని ఏఎన్‌ఎం లు, ఆరోగ్య సిబ్బందికి ట్యాబ్‌లో కేసీఆర్ కిట్ డాటా ఎంట్రీపై శిక్షణ ఇచ్చారు. పీహెచ్‌సీల వారిగా ఆన్‌లైన్ ఎంట్రీలు చేపట్టగా జిల్లా స్థాయి నిపుణులు సిబ్బంది అనుమానాలను నివృత్తి చేశారు. మేడ్చల్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ తుకారాబ్ భట్, డాక్టర్ ఆనంద్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఎం.భాస్కర్, ఎం.మంజూల, డీపీవో సి.ప్రకాశ్‌రెడ్డి, డీడీఎం, ఆరోగ్య కేం ద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...