అరుదైన శస్త్ర చికిత్సలు

Sat,October 20, 2018 12:42 AM

బేగంబజార్, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా లక్షలల్లో అయ్యే ఖర్చును భరించలేని పేదలకు ఉచితంగా ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉస్మానియా దవాఖాన వైద్యు లు మరో మారు తమ ఘనతను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభు త్వం అందిస్తున్న సహకారంతో ఎన్నో క్లిష్టతరమైన కాలేయ, కిడ్నీ మార్పిడిలు చేసిన ఉస్మానియా వైద్యులు తాజాగా ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యు ల బృందం ముగ్గురు రోగులకు అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా ముగించి రో గులు, వారి సహాయకులు తమపై ఉం చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.ఆరోగ్యశ్రీ వంటి అవకాశాలు లేని వారికి, ఆర్ధికంగా ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఉస్మానియా లో మెరుగైన వైద్యా న్ని అందిస్తున్నట్లు డాక్టర్ నాగప్రసాద్ పేర్కోన్నారు.కార్పోరేట్ ఆస్పత్రులలో నిర్వహించలేని అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ దవాఖాన ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసిన వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు.

నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన మంగమ్మ కూతురు సుప్రజకి గత మూడు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్ తగలడంతో మెడ కింది భాగం అతుక్కు పోయింది.దీంతో గత మూడేళ్లుగా తల పైకి ఎత్తేందుకు ఎన్నో అవస్థలు పడుతున్న సుప్రజ ఈ నెల 15న ఉస్మానియాలో చేరారు.రెండు రోజులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు కాంట్రాక్చర్ రీలీస్ స్కిన్ గ్రాఫ్ట్స్ సర్జరీ చేసి విజయవంతం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నరసింహులు పేటకు చెందిన గోపాల్,దుర్గమ్మ దంపతులకు చెందిన లింగయ్య బైక్ వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యడు. దీంతో ప్రమాదంలో లింగయ్య కుడి కన్ను రెప్పలు,ఎముకలు విరిగాయి.ఉస్మానియా లో చేర్చుకున్న వైద్యులు సర్జరీ చేసి సాధారణ స్థితికి తీసుకువచ్చారు.
అదిలాబాద్ జిల్లా, ఖానాపూర్‌కు చెందిన షేక్ ఆయుబ్ కూతురు రుక్సార్ రెండు సంవత్సరాల ముందు వేడి వేడి నూనె పడటంతో కింద పెదవి కాలి నోరు మూయలేని స్థితితో పాటు భు జించిన ఆహారం,నీరు కిందపడి పోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో,కార్పొరేట్ ఆసుపత్రులలోని వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో పలువురు చేసిన సూచనల మేరకు ఉస్మానియా దవాఖానలో చేర్పించగా పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి సర్జరీ చేసి సరిచేశారు.

175

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles