రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం


Thu,October 18, 2018 01:11 AM

బడంగ్‌పేట, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమనీ, ఆ ఆశయంతోనే మరిన్ని హామీలు ఇచ్చారని మహేశ్వరం టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపాలిటీ పరిధి టీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ వారు లేని పోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ఎక్కడ అభివృద్ధి చేసిందో చూపించాలన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గతంలో మేనిఫెస్టోలో లేని పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలు, మహాకూటమికి దిమ్మ తిరిగిందన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా రూ.10వేలు ఇవ్వడం, లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంపై రైతులు సంబురాలు జరుపుకుంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెడుతున్నదన్నారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, ఎంపీటీసీలు తీగల నితీష్‌రెడ్డి, చల్వాది రాజేశ్‌కుమార్, తీగల రంజిత్‌రెడ్డి, దేరంగుల క్రిష్ణవేణి యాదయ్య, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...