నకిలీ ఓట్లను తొలిగించాలి

Wed,October 17, 2018 01:06 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నకిలీ ఓటర్లను తుది ముసాయిదా జాబితా నుంచి వెంటనే తొలిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ జిల్లా ఎన్నికల అధికారి డా.ఎంవీ రెడ్డి, ఈఆర్‌వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. మంగళవారం వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరణించిన, నకిలీ ఓట్లను వెంటనే తొలిగించి, వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు అందజేయాలన్నారు. పోలీసు అధికారులు, నోడల్ ఆఫీసర్లు, ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వివరాలు అందించాలి
జిల్లాలో మార్పులు, చేర్పులు జరిగిన పోలింగ్ కేంద్రాల వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ను రూపొందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్‌రెడ్డి, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

236
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles