సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు


Wed,October 17, 2018 12:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాటుచేసిన కొలనులను బతుకమ్మ నిమజ్జనాలకు పూర్తిస్థాయిలో సిద్ధంచేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. బతుకమ్మ ఆడే ప్రధాన ఆలయా లు, బావులు, చెరువు ప్రాంతాలు, మైదానాలలో ఏర్పాట్లనుపూర్తిస్థాయిలో చేపట్టడంతోపాటు గణేష్ నిమజ్జన చెరువుల్లోని వ్యర్థాలను తొలగించి తిరిగి మంచినీటితో నింపుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే మొదటిరోజు కొన్ని నిమజ్జన కొలనుల్లో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసినట్లు చెప్పారు. 23 గణేష్ నిమజ్జన కొలనులవద్ద లైటింగ్ ఏర్పాటు, పారిశుధ్యం తదితర పనులు కూడా చేస్తున్నామన్నారు. ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ లో సైతం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బతుకమ్మ ఘాట్ చుట్టూ 500మీటర్ల పొడవునా స్వచ్ఛమైన నీటితో కొలనులను నిర్మించారు. ఈ ఘాట్‌లో బతుకమ్మ వేడుకలను వీక్షించేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటుచేశారు. ఈ బతుకమ్మఘాట్‌లో అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటుచేయడం, బతుకమ్మ ఆడే ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది నియామకం, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఇప్పటికే నగరంలోని 110ప్రధాన జంక్ష న్లు, కూడళ్లు,పార్కుల్లో ఆరు ఫీట్లకుపైగా ఎత్తుగల బతుకమ్మలను ఏర్పాటుచేశారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...