గుండెనిండా.. గులాబీ జెండా


Tue,October 16, 2018 12:31 AM

-సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ప్రచార పాట
-సాంగ్ చిత్రీకరించిన జగన్మోహన్‌రావును ప్రశంసించిన మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఎన్నికల వేళ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది..అభ్యర్థుల రాజకీయ అరంగేట్రం, ప్రజాసేవ తీరుతెన్నులు తదితర రంగాల్లో ఎదిగి వచ్చిన తీరు క్షణాల్లో ఓటర్‌కు చేరేలా ఒకవైపు.. మరోవైపు మాటల తూటాలు..సవాల్.. ప్రతిసవాళ్లు.. వెరసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో సోషల్ మీడియా ఇప్పుడు సరికొత్త వేదికగా మారింది. పాటలు, వీడియో ప్రోగాములు రూపొందించి ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో పోస్టు అవుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం సీనియర్ నాయకుడు పాటిమీది జగన్మోహన్ రావు డైరెక్షన్‌లో రూపొందిన గులాబీ జెండా పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఎన్నికల సందర్భంగా కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకుగానూ చిత్రీకరించిన ఈ గులాబీ జెండా పాటను ఆదివారం రాత్రి మంత్రి కేటీఆర్ విడుదల చేయగా, ఒక్క రోజులోనే 2500లకు పైగా షేరింగ్, లక్షలాది లైక్‌లతో వైరల్‌గా మారిందని జగన్మోహన రావు తెలిపారు. గులాబీ జెండా విశిష్టతను తెలియజేస్తూ ఒక్క రోజులోనే ఈ పాటను చిత్రీకరించానని, ఈ గులాబీ జెండాని చిత్రీకరించిన విధానంపై మంత్రి కేటీఆర్ ప్రశంసించి స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు తెలిపారు.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...