ఆశ పెట్టి.. కోట్లు కొల్లగొట్టి..

Fri,October 12, 2018 12:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నా ఖాతాలో రూ.1600 కోట్లున్నాయి.. వాటి రిలీజ్‌కు మీరు కొంత పెట్టుబడి పెడితే మీకు రూ.248 కోట్లు వా టాగా ఇస్తా.. అని ఆశ పుట్టించి కోట్లు దండుకుంటున్న ఓ కిలేడీని గురువారం రాచకొండ ఎస్‌ఓ టీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం. భగవత్ వివరాల ప్రకా రం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన కోటగిరి రా మారావుకు కొద్ది రోజు కిందట ఆంధ్రప్రదేశ్ పశ్చి మ గోదావలి జిల్లా ప్రతిపాడు ప్రాంతానికి చెందిన మాటేటి ఆశకిరణ్ అనే మహిళ పరిచయమైంది. తనకు అమెరికాలో చాలా ఆస్తులు (62,600,89 9.47 డాలర్లు విలువ చేసే) ఉన్నాయనీ, వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులు(రూ.1600కోట్లు) బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో డిపాజిట్ అయ్యిందని ఆశకిరణ్ చెప్పింది. ఫెడరల్ రిజర్వు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వాటి రిలీజ్‌కు కొన్ని అంతరాయాలున్నాయనీ, కొంత నగదు మన బ్యాంక్ లో జమ చేస్తే, ఆ మొత్తం మన బ్యాంక్ ఖాతాలో వస్తాయని నమ్మించింది.

దీని కోసం సృష్టించిన కొన్ని నకిలీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆర్‌బీఐ క్లియరెన్స్, లీగల్ నోటీసు, రిమైండర్ నోటీసులు, గడు వు తేదీ పత్రాలను రామారావుకు చూపించింది. మీరు కొంత నగదు డిపాజిట్ చేస్తే, రూ.600 కోట్ల రిలీజ్ చేసుకుని, అందులోంచి రూ.248 కోట్లు ఇస్తానని హామీచ్చింది. దీనికి సంబంధించి ఎస్‌బీఐ బ్యాంక్ జారీ చేసిన రూ.248 కోట్లకు సం బంధించిన ఓ పత్రాన్ని చూపించింది. ఇది నిజమని నమ్మిన రామారావు అగ్రిమెంట్ పత్రాలు, చెక్కులు రాసుకుని, ఆశకిరణ్ సూచించిన ఖాతా లో రూ.1.18 కోట్లు డిపాజిట్ చేశాడు. వీటిని విత్‌డ్రా చేసుకోవద్దనే షరతును పెట్టి, సంబంధిత బ్యాంక్ అధికారికి సమాచారమిచ్చాడు. ఆశాకిరణ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయితే తనకు తెలపాలని కోరాడు. కొద్ది రోజుల తర్వాత రామారా వు తెలిపిన ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అవుతున్నట్లు గమనించిన బ్యాంక్ అధికారులు, అతనికి సమాచారమిచ్చారు.

వెంటనే అప్రమత్తమైన రా మారావు ఆశాకిరణ్ ఇచ్చిన చెక్‌తో బ్యాంక్ నుంచి రూ.52లక్షలు డ్రా చేశాడు. మిగతా రూ.66 లక్షలకు సంబంధించిన నగదు ఇవ్వకుండా ఆశకిరణ్ తప్పించుకుని తిరుగుతుండగా, రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసు లు ఎట్టకేలకు ఆమెను గురువారం అరెస్టు చేసి, రూ.22లక్షలు విలువ చేసే బంగారం ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, 10 లక్షలు విలువ చేసే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్, ఖరీదైన ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆశా కిరణ్‌కు నకిలీ పత్రాలను సృష్టించడంలో సహకరించిన ఆమె స్నేహితుడు హేమంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో ఆశాకిరణ్‌పై ఇదే తరహా మోసాలకు సంబంధించి మహంకాళి, చైతన్యపురి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ బృందాన్ని సీపీ మహేశ్ ఎం. భగవత్ అభినందించి, రివార్డులు అందించారు.

భారీగా డబ్బు సంపాదించడమే ఆశ..
ఎమ్మెస్సీ మైక్రో బయోలాజీలో పీజీ పూర్తి చేసిన ఆశాకిరణ్ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో మెరైన్ బయోలాజీ కోర్సు లో చేరి మధ్యలో వచ్చేసింది. భర్తలతో విడిపోయి మొదట కూకట్‌పల్లిలో ఉండి, తర్వాత అల్కాపురి రాక్‌టౌన్‌కు మకాం మార్చింది. ఇటీవల వీఎఫ్‌ఎ క్స్ సంస్థలో విజ్యువెల్ ఎఫెక్స్ట్ డైరెక్టర్‌గా చేరిన ఆ శాకిరణ్‌కు ప్రశాంత్ కలవడంతో అతనితో ఈ తర హా క్రైంకు బాధితులను వెదకాలని పురమాయించింది. ఆశాకిరణ్ తనకు ఉన్న నైపుణ్యంతో హాలీవుడ్ సినిమాలతో పాటు రాణీ రుద్రమ దేవి, బా హుబలి సినిమాలో గ్రాఫిక్స్ డైరెక్టర్‌గా పని చేసిందని పోలీసులకు విచారణలో తెలిసింది. ఇంకా చాలా భారీ సినిమాలకు గ్రాఫిక్స్ డైరెక్టర్ పని చేసినట్లు ఆమె వివరించింది. అయితే ఈ విషయాలపై నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

661

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles