ఇప్పుడు వెతుక్కునే పరిస్థితి లేదు

Fri,October 12, 2018 12:49 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ జిల్లా ఖరీదైన స్థలాలకు కేరాఫ్ అడ్రస్. కాని ప్రజా అవసరాలకు కావాలంటే ఇంచు స్థలం కూడ దొరకదు. పేద పిల్లలకు స్కూల్ కడదామన్నా.. హాస్టల్ నిర్మిద్దామన్నా.. దవాఖాన పెడదామన్నా నాటి పాలకులకు చేతులు వచ్చేవికాదు. అయ్యవార్లు చొరవ చూపేవారు కాదు. కాని ఇదంతా ఇది వరకే. తెలంగాణ సర్కారు ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాలకే కేటాయించింది. ఇలా ఏడాది కాలంలో 57 చోట్ల ప్రభుత్వ అవసరాలకు స్థలాలను కేటాయించింది. వీర సైనికుడు ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులకు జిల్లాలోనే స్థలాలను కేటాయించడం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలో విలువైన వందలాది ఎకరాల ప్రభుత్వ భూములుండేవి. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితం గా ఈ భూములన్ని అన్యాక్రాంతమయ్యాయి. ఫలితంగా జిల్లాలో చాలా మండలాల్లో భూతద్దం పెట్టి వెతికినా స్థలా లు దొరికే పరిస్థితి లేదు. ఆసిఫ్‌నగర్, మారేడ్‌పల్లి, బండ్లగూడ, బహద్దూర్‌పుర మండలాల్లో అనేక భూములు ఎప్పుడో దారాదత్తమయ్యాయి. ఇలాంటి ఉల్లంఘనలకు తెలంగాణ సర్కార్ వచ్చి రాగానే చెక్ పెట్టింది. ఫలితంగా స్వరాష్ట్రంలో ప్రభుత్వ భూములు ప్రజోపయోగానికే వినియోగమవుతున్నాయి. అడ్డగోలు కేటాయింపులను పక్కనబెట్టి ప్రభుత్వశాఖలకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలా జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్లకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాలను కేటాయిస్తున్నది. వివాదాల్లో లేకుండా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకుని కేటాయింపులు చేశారు. వీటిని అడ్వా న్స్ ప్రొజిషన్ అప్పగించిన అధికారులు తమ అవసరాల మేరకు నిర్మాణాలు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

శాఖలకు కేటాయింపు ఇలా..
గిరిజన సంక్షేమశాఖ : 02
పోలీసుశాఖ : 01
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ : 12
అగ్నిమాపకశాఖ : 01
క్రీడా, సంఘ విద్రోహక దాడుల బాధితులు : 04
అంగన్‌వాడీ కేంద్రాలు : 35
మహిళా, శిశు సంక్షేమం, వికలాంగులశాఖ : 02
మొత్తం 57

400

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles