ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయండి

Fri,October 12, 2018 12:48 AM

మేడ్చల్ కలెక్టరేట్: జిల్లాలో ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలనీ, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ ఎంవీరెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో రెవెన్యూ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో కలెక్టర్ సమీక్షా నిర్వహించి, పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, రూట్‌మ్యాప్ తయారీ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రత్యేక స్వాడ్స్, ైఫ్లెయింగ్ టీంలను ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తును ముమ్మరం చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, మైకులు, ర్యాలీలు నిర్వహించేందుకు గానూ కచ్చితమైన అనుమతి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు చెందిన ప్రచార సామగ్రి, ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్ బోర్డులు, తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుంటాయన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల నోడల్ అధికారులు తమకు అప్పగించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఏఈఆర్వోలు, ఈఆర్వోలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ అన్నారు. ఎన్నికల నియమావళి పై ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ర్యాంపులు, ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్ ఎంవీరెడ్డి కేక్ కట్ చేసి, జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

449

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles