సాగర తీరం.. పూల వనం

Thu,October 11, 2018 01:11 AM

ఖైరతాబాద్ : సాయం సమయంలో.. సాగర తీరంలో పూల పండుగ బతుకమ్మ సంబురాలు ఆధ్మాత్మికానందాన్ని పంచాయి. ప్రకృతి పరవశించే వాతావరణంలో తంగేడు, గునుగు, బంతి వంటి తీరొక్కపూలతో అలంకరించిన ఐదడుగుల బతుకమ్మ రూపం తెలంగాణ ఔన్నత్యాన్ని చాటింది. బుధవారం సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వేదికగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం ఆహ్లాదాన్ని పంచింది. జలవిహార్ డైరెక్టర్లు నడింపల్లి ఇందిర, రామరాజు, చెన్నమనేని సుజాత లక్ష్మీప్రసాద్, జనరల్ మేనేజర్ ప్రతాప్, మేనేజర్ జ్యోతి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున రాజేందర్, అనిత నర్సయ్యగౌడ్, బొంతు శ్రీదేవి రామ్మోహన్, స్వర్ణ శ్రీనివాస్ యాదవ్‌లు వేలాది మంది ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని చాటుతుందని, గౌరమ్మ అందరికీ శుభాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. బొంతు శ్రీదేవీ మాట్లాడుతూ స్త్రీలు ఎంతో పవిత్రంగా తొమ్మిది రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పురాణాల్లో ప్రస్తావించారని, బతుకునిచ్చు తల్లి బతుకమ్మను కొలిస్తే ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో వేడుకగా నిర్వహిస్తారన్నారు. రాష్ట్రం, దేశంలోనే కాకుండా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తెలంగాణకు చెందిన ఆడపడుచులు ప్రతిఏడాది ఈ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటారని తెలిపారు. ఈ వేడుకల్లో అనూస్ సిస్టర్స్, యువతులు, మహిళలు పాల్గొన్నారు.

557

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles