బతుకమ్మ సంబురాలు

Thu,October 11, 2018 01:11 AM

-రవీంద్రభారతిలో కాకతీయ వైభవం నృత్యరూపకం..
-వీరుల చరిత్రను ఆవిష్కరించిన గజల్ గానం
రవీంద్రభారతి : తెలంగాణ చారిత్రక శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పిన కాకతీయ కళావైభవం కూచిపూడి నృత్యరూపకం అలనాటి చరిత్రక వైభవాన్ని కండ్ల ముందు కదలాడేలా చేసింది. రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన వేదికపై వరంగల్‌కు చెందిన నాట్య గురువు సుధీర్‌రావు శిష్యబృందం కళాకారులు 20 మంది కలిసి కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించారు. ఇందులో ఓరుగల్లు కోట, ఖుషీ మహల్, హరిదాసుపాట, గంగిరెద్దుల విన్యాసం, జానపద నృత్యం అంశాలు 30 నిమిషాల సంగీత నృత్యరూపకం జనరంజకంగా ప్రదర్శించారు.

ఉద్యమ చరిత్రను ఆవిష్కరించిన తెలుగు గజల్ గానం : పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ.. జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ.. అంటూ ఇందిరా బైరి రచించిన తెలుగు గజల్స్‌ను నృత్యరూపకం ప్రదర్శనకు ముందుగా గజల్ గాయని హిమజ రామమ్ ఆలపించి శ్రోతల్ని అలరించారు. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. వంటి బతుకమ్మ పాటలకు అనుగుణంగా రవీంద్రభారతి ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేసుకున్నారు.

480

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles