సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Thu,October 11, 2018 01:10 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబరాబాద్ సైబర్ టవర్స్ (హైటెక్ సిటీ జంక్షన్), మైండ్‌స్పేస్ జంక్షన్(ఐకియా) వద్ద నిర్మాణం చేపడుతున్న హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ పనుల సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలను విధిం చారు. ఈ ఆంక్షలు అక్టోబరు 11 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలై మూడు నెలల పాటు కొనసాగుతాయని ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మెట్రో స్టేషన్ నిర్మాణ పనుల భాగంగా సైబర్ టవర్స్(హైటెక్ సిటీ జంక్షన్) నుంచి సైబర్ గేట్‌వే వరకు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. జెఎన్‌టీయూ వైపు వెళ్ళే దారిలో సైబర్ టవర్స్ ైఫ్లెఓవర్ వద్ద పాక్షికంగా దారిని మూసివేస్తున్నారు. ఈ ైఫ్లెఓవర్ మీదుగా సైబర్ గేట్‌వే వైపు వెళ్ళే మార్గం మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణించడానికి సరికొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఇలా ప్రయాణించండి
1. మైండ్‌స్పేస్ అండర్‌పాస్-ఎడమ వైపు తీసుకుని లెమన్ ట్రీ హోటల్ నుంచి హెచ్‌ఎస్‌బీసీ, హెచ్3, దివ్య శ్రీ, ట్రినిటీ, దివ్యశ్రీ ఫస్త్రజ్ 1, 2 టీఎస్‌ఐఐసీ ఫినిక్స్ ఐటీ సెజ్, డెల్ వాల్యూ ల్యాబ్స్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ అనంత్ బిల్డింగ్, ఎన్ హైట్స్ బిల్డింగ్, ఓఎస్‌ఐ బిల్డింగ్, వెస్టర్న్ అక్వా బిల్డింగ్ వంశిరామ్స్, జ్యోతి కాస్మోస్, పూర్వ సమ్మిట్ బిల్డింగ్, వాటర్ మార్క్ బిల్డింగ్ అస్రా టవర్స్, రెయిన్‌బో ఆసుపత్రి, లెజండ్ ప్లాటినమ్, సీఐఐ జంక్షన్ కుడి తీసుకుని హైటెక్స్ శిల్పారామం, సైబర్ టవర్స్ జంక్షన్.
2. శిల్పారామం వద్ద ఎడమకు తీసుకొని జూబ్లీ ఎన్‌క్లేవ్ ఆర్చ్, సీఐఐ జంక్షన్ మీదుగా టెక్ మహీంద్రా-ఒరాకిల్-డెల్-డీలాయిట్-హెచ్‌ఎస్‌బీసీ-ఫినిక్స్ సెజ్.
3. ఆర్‌ఓబీ- సైబర్ టవర్స్ ైఫ్లెఓవర్-టీసీఎస్-మైండ స్పేస్-యూటర్న్ మైండ్‌స్పేస్ రొటరీ-ఎడమవైపు తిప్పుకుని లెమెన్ ట్రీ హోటల్, మీదుగా చేరాలి.
4. సైబర్ టవర్స్ ఎడమ వైపు తిప్పుకుని అండర్ ైఫ్లెఓవర్ మీదుగా ట్రైడెంట్- శిల్పకళావేదిక సైడ్ రోడ్డు-సైబర్ గేట్‌వే- ఎడమ తిప్పుకుని మెయిన్ రోడ్డులో చేరుకోవాలి. టీసీఎస్-మైండ్ స్పేస్-యూటర్న్-మైండ్‌స్పేస్ రోటరీ వద్ద ఎడమ వైపు తిప్పుకుని లెమన్ ట్రీ నుంచి ముందుకు సాగాలి.
5. ట్రిపుల్ ఐటీ జంక్షన్-గచ్చిబౌలీ వద్ద ఎడమ వైపు తిరిగి -బొటానికల్ గార్డెన్ కుడి వైపు టర్న్ తీసుకుని కొత్తగూడ జంక్షన్-సైబర్ టవర్స్-జూబ్లీహిల్స్
6. టోలీచౌకీ-విస్పర్ వ్యాలీ జంక్షన్-ఖాజాగూడ-బయోడైవర్సిటీ జంక్షన్-టెలికాంనగర్-కుడి వైపు టర్న్‌గచ్చిబౌలీ జంక్షన్-బొటానికల్ గార్డెన్-కొత్తగూడ.
7. గచ్చిబౌలీ జంక్షన్-బొటానికల్ గార్డెన్-కుడి వైపు టర్న్ తీసుకుని కొత్తగూడ జంక్షన్-హైటెక్స్ జంక్షన్-సైబర్ టవర్స్ జంక్షన్
8. ఆర్‌ఓబీ-సైబర్ టవర్స్ ైఫ్లెఓవర్-సైబర్ గేట్‌వే-మైండ్‌స్పేస్-బయోడైవర్సిటీ-ఎడమ వైపు టర్న్ తీసుకుని మెహిదిపట్నం వైపు వెళ్ళి కుడి తీసుకుని గచ్చిబౌలికి రావాలి.
9.హెచ్‌ఎస్‌బీసీ వద్ద ఎడమవైపు తీసుకుని లెమన్ ట్రీ వైపు వెళ్ళాలి. అక్కడ ఎడమ టర్న్ తీసుకుని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్- సైబర్ పెరల్ యూటర్న్ తీసుకుని, టీసీఎస్, మైండ్ స్పేస్ అండర్‌పాస్-బయోడైవర్సిటీ జంక్షన్ సీఐఐ జంక్షన్ మార్గంలో ప్రయాణించి కుడి టర్న్ తీసుకుని హైటెక్స్-సైబర్ సైబర్ టవర్స్‌కు చేరాలి.
10. హెచ్‌ఎస్‌బీసీ వద్ద యూటర్న్ తీసుకుని ఒరాకిల్ మీదుగా సీఐఐ జంక్షన్, కుడి వైపు తీసుకుని సీఐఐ జంక్షన్-హైటెక్స్-సైబర్ టవర్స్
11. మైండ్ స్పేస్ అండర్ పాస్-లెమన్ ట్రీ హోటల్-సైబర్ పెర్ల-ఎడమ తీసుకుని సైబర్ టవర్స్ గేట్‌వే-డెల్- సీఐఐ జంక్షన్ మార్గంలో ప్రయాణించాలి.

ఈ అంక్షలు, మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు, ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ కోరారు. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా వాహనదారులు ప్రతిపాదించిన రూట్లలో ప్రయాణించి సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

529

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles