నగరం చుట్టూ కృష్ణా..గోదావరి


Fri,September 21, 2018 12:44 AM

-విశ్వనగరానికి మరో భారీ ప్రాజెక్ట్
-కృష్ణా -గోదావరి జలాల అనుసంధానం
-రూ. 4765.00 కోట్లతో ఔటర్ వెంట రింగ్ మెయిన్ పైపులైన్
-ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్
-నగరంలో ఎక్కడా నీటి సమస్య రాకుండా చర్యలు


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్‌కు మరో భారీ ప్రాజెక్ట్ మణిహారం కానున్నది. కృష్ణా-గోదావరి జలాలను అనుసంధానించడానికి ఔటర్ చుట్టూ రూ. 4765.00 కోట్లతో భారీ రింగ్ మెయిన్ పైపులైన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు టాటా కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్‌ను రూపొందించారు. 158 కిలోమీటర్ల మేర పైపులైన్, 12 చోట్ల రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. 169.30 స్కేర్ కిలోమీటర్ల మేర ఉన్న జల మండలి సేవల పరిధిని 1628 స్కేర్ కిలోమీటర్ల మేరకు పెంచిన సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రేటర్‌లోకి విలీనమైన 12 మున్సిపాలిటీల్లో రూ. 1900 కోట్లతో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి దాహార్తిని తీర్చారు. అయితే గోదావరి ప్రాజెక్టులోని కీలకమైన ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు రిజర్వాయర్ వరకు 1800 ఎంఎం డయా వ్యాసార్థంతో 44 కిలోమీటర్ల మేర పైపులైన్ పనుల్లో రైల్వే క్రాసింగ్ మినహా 40 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. ఇదే క్రమంలో నగర చరిత్రలో ఔటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు అమలుకు రంగం సిద్ధం కావడం గమనార్హం.

పైపులైన్ విస్తరణలో కీలక అంశాలు
రైల్వే క్రాసింగ్‌లు: శంషాబాద్ ఎయిర్‌పోర్టు , మైలార్‌దేవరపల్లి జీఎల్‌ఎస్‌ఆర్ (రిజర్వాయర్), నాగులపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్, గౌరెల్లి, గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్, కండ్లకోయ జంక్షన్, గుండ్లపోచంపల్లి, ఘట్‌కేసర్, చర్లపల్లి రైల్వే స్టేషన్
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట : ముత్తంగి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, తుక్కుగూడ, పెద్ద అంబర్‌పేట, అన్నోజిగూడ, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, రాజేంద్రనగర్ జంక్షన్, బొంగుళూరు, కోకాపేట, నార్సింగి, టీఎస్‌పీఏ జంక్షన్, శామీర్‌పేట జంక్షన్
రోటరీ క్రాసింగ్‌లు: ఎయిర్‌పోర్టు జంక్షన్, రాజేంద్రనగర్, టీఎస్‌పీఏ, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, తెల్లాపూర్ జంక్షన్, ముత్తంగి, దయరా, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట, ఈఎస్‌ఐఎల్, అన్నోజిగూడ, గౌరెల్లి , పెద్ద అంబర్‌పేట, బొంగుళూరు, తుక్కుగూడ, చిన్నగోల్కొండ జంక్షన్‌ల వద్ద కలిపి 8160 మీటర్ల మేర రోటరీ క్రాసింగ్‌లు ఉన్నాయి.
రివర్ క్రాసింగ్: నార్సింగి మూసీ రివర్ వద్ద (170 మీటర్లు), రాజేంద్రనగర్ (170 మీటర్లు), గౌరెల్లి నుంచి అన్నోజిగూడ జంక్షన్ (250 మీటర్ల) మేర పైపు బ్రిడ్జి పనులు చేపడుతారు.

శాశ్వత పరిష్కారం..
నగరంలో కృష్ణా, గోదావరి నీటి సరఫరా వ్యవస్థలను అనుసంధానం చేయడంతో నీటి కొరత ఉండదు. నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలుంటుంది. నిరంతరం ప్రజలకు ఇబ్బంది లేకుండా నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రికార్డు సమయంలో హడ్కో, ఓఆర్‌ఆర్ తాగునీటి పథకం పనులను పూర్తి చేసి ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపాం. ఇదే స్ఫూర్తితో కేశవాపురం భారీ రిజర్వాయర్, రింగు మెయిన్ పైపులైన్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రస్తుతం ఔటర్ రింగు మె యిన్ పైపులైన్ ప్రాజెక్టు డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జలమండలి ప్రాజెక్టులకు ఏడీబీ బ్యాంకు రుణం అందించేందుకు ముందుకువస్తున్నది. త్వరలో ఆచరణలోకి తీసుకువస్తాం. నగర వాసులకు తాగునీటి ఇబ్బందులు రానివ్వం.
- ఎం. దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ప్రాజెక్టు స్వరూపం

అంశం అంచనా వ్యయం (రూ. కోట్లలో)
158 కిలోమీటర్లలో 3000 ఎంఎం డయా సామర్థ్యం గల పైపులైన్ 3965.00
రేడియల్ మెయిన్ పైపులైన్ విస్తరణ 550.00
12 చోట్ల గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం (అనుసంధానం) 250.00

158 కిలో మీటర్ల పరిధిలో..3000 ఎంఎం డయా పైప్‌లైన్
3000 ఎంఎం డయా భారీ పైపులైన్ విస్తరణలో చాలా అవాంతరాలు అధిగమించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల అనుమతులతో పనులు చేపట్టాల్సి వస్తుంది. జంక్షన్ల వద్ద పనులు, రేడియల్ మెయి న్స్, రైల్వే క్రాసింగ్స్, జాతీయ రహదారులు, స్టేట్ హైవే క్రాసింగ్ ల వద్ద పనులకు అనుమతులు, రోటరీ క్రాసింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 158 కిలోమీటర్ల ఔటర్‌లో ముత్తం గి, కండ్లకోయ, శామీర్‌పేట, అన్నోజిగూడ, పెద్ద అంబర్‌పేట, బొంగుళూరు, ఆదిబట్ల, తుక్కుగూడ, ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పుర, కోకాపేట జంక్షన్ మీదుగా పైపులైన్ అలైన్‌మెంట్ చేశారు.

జలమండలి ప్రస్తుత సేవలు..
-కోర్ సిటీ పరిధిలో 169.3 స్కేర్ కిలోమీటర్లు
-శివారు మున్సిపాలిటీల వరకు 518.90 స్కేర్ కిలోమీటర్లు
-ఔటర్ రింగ్ రోడ్డు వరకు 939.80స్కేర్ కిలోమీటర్లు
-మొత్తం సేవల పరిధి 1628 స్కేర్ కిలోమీటర్లు
-రోజువారీగా సరఫరా చేస్తున్న నీరు 448 ఎంజీ డీలు (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) మంజీరా జలాశయం నుంచి 18 ఎంజీడీలు, సింగూరు 30 ఎంజీడీలు, అక్కంపల్లి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, ఎల్లంపల్లి గోదావరి ద్వారా 130 ఎంజీడీలు జీహెచ్‌ఎంసీ ఏరియాలో 400 ఎంజీడీలు, జీహెచ్ ఎంసీ అవతల 48 ఎంజీడీల సరఫరా
-కోర్ సిటీలో 98 శాతం (150ఎల్‌పీసీడీ), శివార్లలో 80 శాతం (130ఎఎల్‌పీసీడీ) నీటి సరఫరా
-జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు 9.8 లక్షలు
-నెలవారీ నిర్వహణ ఖర్చులు -138 కోట్లు
-నెలవారీ సంస్థ రాబడి 120కోట్లు

భవిష్యత్తులో నీటి డిమాండ్ ( జలమండలి అధికారుల అంచనా)
పరిధి/ స్కేర్ మీటర్లలో 2020 నాటికి 2025 2050
కోర్ సిటీ /169.30 255.64 317.13 346.69
శివారు ప్రాంతాలు /518.90 234.96 321.35 356.76
ఓఆర్‌ఆర్ గ్రామాల వరకు/939.80 118.68 182.57 308.57
మొత్తం 1628స్కేర్ కిలోమీటర్లు 609.28 ఎంజీడీలు 821.05 1012.02

647

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles