యుద్ధప్రాతిపదికన ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయండి

Thu,September 20, 2018 02:21 AM

-నిర్ణీత ఫీజు చెల్లించని దరఖాస్తుదారులపై
ప్రత్యేక దృష్టి సారించండి
-హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
సిటీబ్యూరో : ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ రుసుంను చెల్లించని దరఖాస్తుదారులపై ప్రత్యేక దృష్టించాలని, సంబంధిత దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలన్న సమాచారం చేరవేరిందా లేదా అన్నది తెలుసుకోవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి జనార్దన్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తార్నాక సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కలిసి కమిషనర్ ఎల్‌ఆర్‌ఎస్ పథకం పురోగతిపై సమీక్షించారు. 9800 మంది ఆయా ప్లాట్ల క్రమబద్ధీకరించుకోవడానికిగానూ ప్రారంభ రుసుం చెల్లించలేదని కమిషనర్ వివరించారు. ఈ దరఖాస్తుదారుల కోసం ప్రభుత్వం వచ్చే నెల 15లోపు ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. అయితే సర్కార్ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదని, అనేకసార్లు ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద రుసుంను చెల్లించేందుకు గడువును పెంచుతూ అవకాశం కల్పించినా.. దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవడం వెనుక గల కారణాలపై సమీక్షించాలని సూచించారు. హెచ్‌ఎండీఏ ద్వారా పంపిన ఎస్‌ఎంఎస్ సమాచారం దరఖాస్తుదారులకు చేరుతుందా? లేదా? దరఖాస్తుదారులిచ్చిన ఫోన్ నంబర్లు సరైనవేనా? వారు స్పందించకపోవడానికి గల కారణాలేమిటో తెలుసుకోవాలన్నారు. 22 వరకు పరిశీలనలో ఉన్న 1349 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జోన్ల వారీగా పని భారం ఎక్కువగా ఉన్న యూనిట్లను గుర్తించి అదనంగా తహసీల్దార్లకు బాధ్యతలను అప్పగించి రెండు, మూడు రోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ప్లానింగ్ విభాగం డైరెక్టర్లు బాలకృష్ణ, శ్రీనివాస్, సీపీవో నరేంద్ర, సీఐవో సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

532

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles