తోవ ముచ్చట్లు పుస్తకావిష్కరణ

Thu,September 20, 2018 02:21 AM

ఖైరతాబాద్ : రచయిత జయధీర్ తిరుమలరావు రచించి, డాక్టర్ ఏకే ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన తోవ ముచ్చట్లు మూడోభాగం పుస్తకాన్ని బుధవారం ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, చిత్రకారులు ఏలె లక్ష్మణ్, తోట వైకుంఠం, కవి, రచయితలు మిత్ర, డాక్టర్ రాజగోపాలరావు, డాక్టర్ కొల్లు రంగారావు, డాక్టర్ మనోజ, పొట్లపల్లి వరప్రసాద్, ఇంద్రపాల శ్రీనివాస్, దాసోజు కృష్ణమాచార్య, లలిత, ప్రజాగాయకురాలు విమలక్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రజల గురించి రచనలు చేసే వారు ప్రజా సమూహంలో కలిసిపోవాలని, ప్రక్రియ ఏదైనా ప్రజల మనోభావాలను ఆకర్షించాలని, అలాంటి రచయితల్లో జయధీర్ తిరుమలరావు ఒకరని కొనియాడారు. రచయిత రాజగోపాల్ మాట్లాడుతూ సాహిత్యకారులంతా ఒకేచోట కలిసేలా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తోట వైకుంఠం మాట్లాడుతూ సాహిత్యమనే వస్తువును రచయితలు ఏ విధంగా తమ కలం ద్వారా ఆకర్షిస్తారో చిత్రకారులు క్యాన్‌వాస్‌లపై అదే విధంగా అద్భుతాలు సృష్టిస్తారన్నారు. పుస్తక రచయిత జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ తోవ ముచ్చట్లలో పైకి కనిపించని జీవితాలున్నాయని, వాటిని అక్షరబద్ధం చేశానని తెలిపారు.

363

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles