స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లుగా మదర్సాలు


Thu,September 20, 2018 02:19 AM

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : ముస్లిం చిన్నారులకు విద్యనందిస్తున్న మదర్సాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. వాటి రూపు రేఖలు మార్చి శిక్షణ పొందిన విద్యావలంటీర్లను నియమించి, పాఠ్యప్రణాళికను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మదర్సాలను స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చి విద్యార్థుల వికాసానికి చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం కొత్త సంస్థల ఎంపికకు జిల్లా సమగ్రశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. జిల్లాలో అర్హులైన నాజ్జీమ్‌లు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను నడిపేందుకు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 29లోగా గన్‌ఫౌండ్రీ ఆలియా కళాశాల ప్రాంగణంలోని డీఈవో కార్యాలయం పైఅంతస్తులో ఉన్న సమగ్రశిక్షా అభియాన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...