రైల్వే ఉద్యోగుల ఆందోళన

Thu,September 20, 2018 02:17 AM

మారేడ్‌పల్లి: రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని, ఇందుకు నిరసనగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లా యీస్ సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదు రుగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ సంఘ్ అధ్య క్షుడు ప్రభాకర్ అండ్రూస్స్ మాట్లాడుతూ 7వ వేతన కమిషన్ ఇచ్చిన సిఫా ర్సులను కేంద్ర ప్రభు త్వం అమలు చేయడం లేదని, దీని వల్లన కేంద్ర ప్రభు త్వ ఉద్యోగులతో పాటు రైల్వే ఉద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతున్నా రన్నారు. ప్రధానంగా కనీస వేతనాన్ని 26 వేల రూపాయలకు పెంచాలని, జాతీయ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఐఆర్ జాతీయ డాక్టర్ మర్రి రాఘవయ్య ఆదే శాల మేరకు జాతీయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు ఎం. ఉమానాగేంద్రమణి, సంయుక్త ప్రధాన కార్య దర్శి . మోహన్‌రావు, సహాయ ప్రధాన కార్యదర్శులు ఎం. భరణిభాను ప్రసాద్, వీరభద్రయ్య, ఎం. రుద్రారెడ్డి, పీఎస్. పెరుమాళ్, డి. భుజంగరావు, కె. బిక్షపతి , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

282

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles