2500 విగ్రహాలు నిమజ్జనం


Thu,September 20, 2018 02:16 AM

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : వినాయకచవితి నాటినుంచి బుధవారం ఉదయం వరకు హుస్సేన్‌సాగర్‌లో సుమారు 2500 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని బల్దియా కమిషనర్ దానకిశోర్ చెప్పారు. ఆదివారం రాత్రి వరకు మరో 10 నుంచి 12 వేల వరకు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు, ఇతర ప్రధాన మార్గాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయకచవితి, మొహర్రం పండుగల ఏర్పాట్లతోపాటు ఓటర్ల జాబితా సవరణపై బుధవారం కమిషనర్ విలేకరులతో మాట్లాడారు. నగరవ్యాప్తంగా రోడ్లపై గుంతల పూడ్చివేత ముమ్మరంగా జరుగుతున్నదని, రోజుకు 600 చొప్పున ఇప్పటివరకు 10 వేల గుంతలు పూడ్చినట్లు చెప్పారు. నిమజ్జనం పూర్తయ్యాక 24వ తేదీ సాయంత్రానికి పూర్తిగా వ్యర్థాలు లేకుండా చేయాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు.

198
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...

Health Articles