అక్రమంగా నివసిస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్


Thu,September 20, 2018 02:14 AM

మెహిదీపట్నం : అక్రమంగా దేశంలో నివసిస్తున్న నైజీరియాకు చెందిన ఇద్దరిని గోల్కొండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సతీశ్‌రెడ్డి కథనం ప్రకారం..... గోల్కొండ సెవెన్‌టూంబ్స్ సమీపంలో ఉన్న డైమండ్ హిల్స్‌లో పలువురు విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నా రు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కో టేశ్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం పలు ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నైజీరి యా దేశం ఎబోని రాష్ర్టానికి చెందిన నన్నా చాయ్‌న్యరే ఓడి(25), ఎనుగూ రాష్ర్టానికి చెందిన కరోలినా నకేగో అయోగు(29)లు ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరిని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...