సాఫీగా సాధారణ ట్రాఫిక్


Wed,September 19, 2018 12:43 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గణేశ్ నిమజ్జనం సందర్భంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జ్జనం సందర్భంగా అటు పాతబస్తీ నుంచి హుస్సేన్‌సాగర్, సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్, అమీర్‌పేట నుంచి ట్యాంక్‌బండ్, బేగంబజార్ చౌడీ నుంచి ఎంజేమార్కెట్ ఇలా ..అన్ని రూట్లు వినాయక విగ్రహాల వాహనాలతో కిక్కిరిసి పోతుంటాయి. దీంతో పాతబస్తీ వైపు నుంచి అమీర్‌పేట, సికింద్రాబాద్ వైపునకు, ఇటువైపు నుంచి అటువైపునకు వెళ్లే వాహనదారులకు స్పష్టమైన రూట్లు తెలియక గంటల తరబడి రోడ్ల వెంట తిరుగుతూ నరకయాతన అనుభవిస్తూ తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకున్న నగర పోలీసులు... ఈ సారి వాహనదారులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేకంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్‌లు వేరువేరుగా సమీక్షలు నిర్వహించి, సామాన్యులు ఇబ్బందులకు గురికావద్దనే విషయంపై ఫోకస్ పెట్టారు. తాజాగా మంగళవారం విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన బందోబస్తుకు సంబంధించిన సమీక్షలోను ఈ విషయంపై సీపీ ప్రత్యేకంగా ట్రాఫిక్ విభాగం అధికారులతో చర్చించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండే విధంగా, నగరంలోని అన్ని ప్రధాన రూట్లను కలిసే విధంగా ఈ ప్రత్యామ్నాయ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క నిమజ్జనం రూట్‌కు ఇబ్బందులు కలుగకుండా, మరోపక్క సామాన్యులు ట్రాఫిక్ రద్దీలో ఇరుక్కోకుండా ఉండే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రాథమికంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు.

రూట్‌మ్యాప్ ఇలా ..
ఉత్తర మండలం నుంచి దక్షిణ మండలం: సీటీవో జంక్షన్, రసూల్‌పురా, హెచ్‌పీఎస్, గ్రీన్‌ల్యాండ్, సోమాజిగూడ, ఖైరతాబాద్, నిరంకారి, రవీంద్రభారతి, పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి, తాజ్ ఐలాండ్, ఏక్‌మినార్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లే దారిలో వెళ్లొచ్చు.
పశ్చిమ మండలం నుంచి తూర్పు మండలం : మాసబ్‌ట్యాంక్, అయోధ్య, నిరంకారి భవన్, రవీంద్రభారతి, ఓల్డ్ పీసీఆర్, బషీర్‌బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, రాంకోఠి, వైఎంసీఏ నుంచి వివిధ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.ఉత్తర మండలం నుంచి తూర్పు మండలం: సీటీవో, సికింద్రాబాద్ వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ, సంగీత్ థియేటర్, ఆలుగడ్డ బావి, చిలకలగూడ రోటరీ, గాంధీ దవాఖాన, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ క్రాస్‌రోడ్స్, వైఎంసీఏ నుంచి వివిధ గమ్యస్థానాలకు చేరుకునే దారుల్లో వెళ్లవచ్చు. దాంతోపాటు ఇందిరాపార్కు, అశోక్‌నగర్ ఎక్స్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, వీఎస్‌టీ, హిందీ మహావిద్యాలయం నుంచి వివిధ మార్గాల్లో వెళ్లవచ్చు.సికింద్రాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు: ప్యారడైజ్, గ్రీన్‌ల్యాండ్, పంజాగుట్ట, రోడ్డు నం. 12 బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, సరోజిని కంటి దవాఖాన, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు.పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టుకు: దారుల్ షరీఫ్ రోటరీ, నయాపూల్, సిటీకాలేజీ, పురానపూల్, బహుదూర్‌పురా, జూపార్కు నుంచి శంషాబాద్, సాలర్జంగ్ మ్యూజియం రోటరీ, చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, డీఎంఆర్‌ఎల్, చాంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...

Health Articles