గ్రేటర్‌లో 39,828 మందికి కంటి పరీక్షలు

Wed,September 19, 2018 12:41 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని 30సర్కిళ్లలో సెప్టెంబర్ 18వ తేదీన 39828మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. ఇందులో 4392మందికి కంటి అద్దాలు పంపిణీచేయగా, 1802మందికి శస్త్రచికిత్సలు జరిపేందుకు రిఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, చార్మినార్‌జోన్‌లో 10932, ఎల్బీనగర్‌లో 5367, ఖైరతాబాద్‌లో 6966, శేరిలింగంపల్లిలో 3351, సికింద్రాబాద్ 6834, కూకట్‌పల్లి జోన్‌లో 6378మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు.

157

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles