అనుభవాలతోనే బౌద్ధాన్ని అర్ధం చేసుకోగలరు

Mon,September 17, 2018 12:23 AM

అమీర్‌పేట్, నమస్తే తెలంగాణ: తమ తమ అనుభవాల ద్వారానే బౌద్ధాన్ని అర్థం చేసుకోగలరని ప్రముఖ బౌద్ధ పరిశోధకులు ఎస్‌ఆర్ బోధి పేర్కొన్నారు. బుద్ధవనం ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున ప్రసంగ పరంపర-7లో భాగంగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఆదివారం హోటల్ హరిత ప్లాజాలో జరిగిన నవయాన బుద్ధిజం అనే అంశంపై జరిగిన ప్రసంగంలో బౌద్ధ పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధి మాట్లాడుతూ బౌద్ధం విశ్వజనీన సత్యమన్నారు. ప్రతీ ఒక్కరూ తమ అనుభవాల ద్వారా మాత్రమే బౌద్ధాన్ని అర్థం చేసుకోగలరని, ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే సిద్ధాంతమే బౌద్ధమన్నారు. బౌద్ధ ధర్మం ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా స్థానిక సంస్కృతులను సమ్మిళితం చేసుకొని, వాటిని మరింత సుందరంగా ఆవిష్కరించిందన్నారు. జపాన్, థాయిలాండ్, చైనా, మలేషియా, తైవాన్, భూటాన్, శ్రీలంక తదితర తూర్పు దక్షిణాసియాల్లో బౌద్ధం విశేష ప్రాచుర్యాన్ని పొందిందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన నవయాన బౌద్ధంతత్వాన్ని, దానిలోని మూలసత్యాలను వివరిస్తూ నేటి సమాజంలో వేళ్లూనుకుని ఉన్న కుల, మత, వర్గ వైరుధ్యాలకు, నవమాన బౌద్ధం పరిష్కారం చూపుతుందని తెలిపారు. ఈ సమావేశానికి పలు విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు, బౌద్ధ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

284

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles