ఓటుతోనే దేశభవిష్యత్తు

Mon,September 17, 2018 12:22 AM

-నెక్లెస్‌రోడ్‌లో మహిళల బైకు ర్యాలీ
- ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు
ఖైరతాబాద్: ఓటు హక్కు మీ జన్మహక్కు....18 సంవత్సరాలు నిండాయా...అయితే ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదుపై నిర్వ హించిన అవగాహన బైక్ ర్యాలీలో మహిళలు, యువతులు పిలుపునిచ్చారు. నెక్లెస్‌రోడ్ లోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఈ యంగ్ ఉమెన్ బైక్ ర్యాలీని ముఖ్య అతిథిగా హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ముషరఫ్ అలీ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన, సర్కిల్ 17 ఉప కమిషనర్ సత్యనారాయణ, ఏఎంఓహెచ్ భార్గవ నారాయణతో కలిసి ప్రారంభించారు. ఓటు హక్కు వినియోగించు కోవాలని, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ మహిళలు స్వయంగా బైకులను నడిపిస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీ నెక్లెస్ రోడ్ చుట్టూ తిరిగి పీపుల్స్‌ప్లాజావద్దకు చేరుకుంది.

ఈ సందర్భంగా కమిషనర్ దాన కిశోర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక యువకులు ఉన్న దేశం భారతదేశమని, దేశ భవి ష్యత్తును రాబోయే తరాలు తమ ఓటు హక్కు ద్వారా నిర్ణయిస్తాయన్నారు. 18 సంవత్స రాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, కళాశాలల్లో యూత్ క్లబ్‌ను ఏర్పాటు చేసి కొత్త ఓటర్లను చేర్చే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని, తొలుత బం జారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో సోమవారం ఈ క్లబ్‌ను ఏర్పాటు చేస్తున్నాట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 20వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఓటు అనేది మన ఆయుధమని, దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో తమ ఓటరు నమోదును కేవలం 3 నిమిషాల్లో చేసుకోవచ్చన్నారు. త్వరలోనే నెక్లెస్‌రోడ్‌లో వయోవృద్ధులతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో తమ వారసులు ఓటు హక్కు వినియోగించుకునేలా వారి చేత ప్రోత్సహించనున్నట్లుతెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెర్టీ-9 సంతాన సాఫల్య కేంద్రం డైరెక్టర్లు డాక్టర్ జ్యోతి, రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ సునీత పాల్గొన్నారు.

348

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles