టగ్ ఆఫ్ వార్ పోటీల ముగింపు


Mon,September 17, 2018 12:21 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మలక్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించిన టగ్‌ఆఫ్ వార్ బాలబాలికల చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్-14 బాలుర విభాగంలో శంఖేశ్వర్ బజార్ ప్రభుత్వ బాలుర హై స్కూల్ మొదటి స్థానం దక్కించుకోగా, ఎస్వీవీ హైస్కూల్, బేగంపేట్ మహర్షి విద్యానికేతన్ జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్-17 బాలుర విభాగంలో స్లాట్ ది స్కూల్, అంబర్‌పేట్ జీబీహెచ్‌ఎస్, కంటోన్మెంట్ టీఎంఆర్‌ఎస్ జట్లు, అండర్-14 బాలికల విభాగంలో స్లాట్ ది స్కూల్, అంబర్‌పేట్ ప్రభుత్వ హైస్కూల్, మెహదీపట్నం బిద్య ఇస్లామిక్ స్కూల్ జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి సాయి కుమార్, ప్రతినిధులు ఎం.రాజభూషణ్, ఓం హరి కృష్ణ, ఎం.విజ్ఞాశ్వర్, రాఘవేందర్ తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...