రోబోటిక్ సర్జరీలపై దృష్టి పెట్టండి

Sun,September 16, 2018 12:31 AM

-అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు దిలీప్‌గోడే
బండ్లగూడ : వైద్యరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా శస్త్రచికిత్సలు చేపట్టాలని, రోబోటిక్ సర్జీలు చేసేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షుడు దిలీప్‌గోడే అన్నారు. శనివారం గండిపేట మండల పరిధిలోని షాదన్ మెడికల్ కాలేజీలో తెలంగాణ ఏఎస్‌ఐవోఎన్ 4వ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానంగా యువ వైద్యులు నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. వైద్యచరిత్రలో రోబోటిక్ సర్జరీలు అరుదుగా జరుగుతున్నాయని, తెలంగాణలో ఇలాంటి వర్క్‌షాపు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ ఏవై చారి మాట్లాడుతూ ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 750 మంది సర్జన్లు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రధానంగా రాష్ర్టానికి చెందిన ప్రొఫెసర్లు సమస్యలను వివరించి పరిష్కారాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఏఎస్‌ఐ చైర్మన్ డాక్టర్ బీరప్ప, కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్, డాక్టర్ శశిధర్‌రెడ్డి, షాదన్ మెడికల్ కాలేజీ చైర్మన్ రసూల్‌ఖాన్, షాదన్ తేనియత్, మహ్మద్ షరీఫ్ రసూల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

274

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles