చేయిజారిపోతున్నారు

Wed,September 12, 2018 12:57 AM

ఉప్పల్,నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ నాయకులంతా పార్టీ వీడుతూ చేయి జారిపోతున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఆ పార్టీ ఖాళీకానున్నది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండారి లకా్ష్మరెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, తమ అనుచరులతో కలిసి బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. వీరితో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గం, ఇతర ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు తరలివెళ్లనున్నారు. ఈమేరకు సుమారు 5 వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నారు. టీడీపీతో కాంగ్రెస్‌పార్టీ అనైతిక పొత్తు, పార్టీ కోసం ఎంతోకాలం పనిచేసినవారిని విస్మరించి, నేతలకు, కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కేసీఆర్ సమక్షంలో చేరిక
ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా బండారి లకా్ష్మరెడ్డి నాయకత్వంలో తెలంగాణ భవన్‌కు కార్యకర్తలు, నేతలు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌ల సమక్షంలో టీఆర్‌ఎస్‌పార్టీలో చేరనున్నారు. దీంతో దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోని క్యాడర్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నది. టీడీపీతో పొత్తుకు నిరసనగా బండారి లకా్ష్మరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీంతో ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది.

386

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles