గ్రేటర్ ఓటర్లు 74 లక్షలు

Tue,September 11, 2018 12:20 AM

-ముసాయిదా విడుదల
-పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా ప్రదర్శన
-అక్టోబర్ 8న తుది జాబితా
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:గ్రేటర్ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా సోమవారం ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేశారు. ముసాయిదా ప్రతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శనకు ఉంచారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు ఈనెల 25వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ నాలుగో తేదీలోగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి ఏడో తేదీలోపు జాబితాను అప్‌డేట్ చేస్తారు. అక్టోబర్ 8న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తారు. కొత్త ఓటర్ల కోసం జనవరి 1 2018ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. అంటే, ఈలోగా 18సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే తాజా సవరణలో భాగంగా ఓటు హక్కు కల్పిస్తారు. అంటే, ఈ ఏడాది జనవరి 1వతేదీ తరువాత 18 ఏండ్లు నిండినవారిని ప్రస్తుత ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం లేదని, వారందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల జాబితాలో చోటు దక్కుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1న 18 ఏండ్లు నిండిన వారి దరఖాస్తులు ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 19వేల పైచిలుకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి నవంబర్‌లో విడుదల చేసే తుది జాబితాలో స్థానం ఉండదని వారు స్పష్టం చేశారు. మరోవైపు, ఓటర్ల జాబితా ముసాయిదాను ఈనెల 1న విడుదల చేసిన విషయం తెలిసిందే.

309
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles