నేటి భారత్ బంద్‌కు ప్రజాసంఘాల మద్దతు

Mon,September 10, 2018 12:47 AM

ఉస్మానియా యూనివర్సిటీ/హిమాయత్‌నగర్: దేశంలో పెరిగిన పెట్రోల్, చమురు ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇతర వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వ హించనున్న సోమవారం నాటి భారత్ బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు వివిధ విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఓయూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లూరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న పన్నులభారం అన్ని నిత్యావసర వస్తు ధరలపై పడుతోందని చెప్పారు. ఎన్డీఏ హయాంలో పెట్రోల్ ధరలు రూ.25 పెరగడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో 23 సార్లకు పైగా పెంచిన పెట్రోల్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు బ్యారెల్ ధర తగ్గినప్పటికీ కేంద్రప్రభుత్వం రోజుకోరీతిలో చమురు ధరలు పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు.

బంద్‌లో ఆటో డ్రైవర్స్ అధిక సంఖ్యల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆటో యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు నిచ్చింది. ఆదివారం నారా యణగూడలోని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆటో జేఏసీ సమావేశం జరి గింది.టీ.ఆటోడ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి. మల్లేశ్‌గౌడ్, ఆటో రిక్షా డ్రైవర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటేశం,ఆటోడ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ యం.డి అమానుల్లాఖాన్‌లు మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికైనా పెంచిన పెట్రో లు,డీజీల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమా వేశంలో ఐఎన్‌టీయూసీ నేత ఎస్.నర్సింహ్మ,ఐఎఫ్‌టీయూ నాయకుడు ఎ. నరేందర్, టీఎడీఎస్ నేత సత్తిరెడ్డి, నాయకులు జానయ్య,అంబదాస్,యండి అంజీద్‌లు పాల్గొన్నారు

245

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles