కృత్రిమ గర్భధారణ సేవలు విస్తృతపర్చాలి

Sun,September 9, 2018 12:42 AM

బేగంబజార్ : రాష్ట్రంలోని రైతుల ఇంటి ముంగిటనే అత్యుత్తమ నాణ్యత గల వీర్యంతో కృత్రిమ గర్భధారణ సేవలను మరింత విస్తృత పరచాలని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గోపాల మిత్రులకు సూచించారు. విజయనగర్ కాలనీలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గోపాల మిత్రా సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ఏడాది గోపాలమిత్రులు దాదాపు ఎనిమిదిన్నర లక్షల రైతుల ఇంటి ముందుకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు అందించారని తెలిపారు. పాడి, పశువులతోనే రైతులు అభివృద్ధి సాధిస్తారని ఈ క్రమంలో గోపాల మిత్రులు వారి సేవలను మరింత విస్తృతపరచాలన్నారు. మన రాష్ట్రంలో ఘనీకృత వీర్యం ఉత్పత్తి కేంద్రం కరీంనగర్‌లో పని చేస్తుందని తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు రైతులు నష్ట పోకుండా పాడి, పశువుల బీమా పథకాన్ని పశు గణాభివృద్ధి సంస్థ అమలుపరుస్తుందని, ఇప్పటివరకు 44వేల పశువులను బీమా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి. మంజువాణి, టీఎస్‌ఎల్‌వోఏ చైర్మన్ సీహెచ్.రాజేశ్వర్‌రావు, జిల్లాల చైర్మన్‌లు, గోపాల మిత్రలు, సూపర్ వైజర్‌లు, పశు గణాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.

208

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles