ఆదివాసీల అభివృద్ధికి సర్కార్ ప్రత్యేక చర్యలు


Fri,August 10, 2018 12:32 AM

ఉస్మానియా యూనివర్సిటీ/సైదాబాద్ (నమస్తే తెలంగాణ):ఆదివాసీల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తోందని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఆదివాసీల్లో చైతన్యం లేకపోవడంతోనే రాజ్యాంగం కల్పించిన చట్టాల అమలులో వైఫల్యం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ పక్షాన పనిచేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం, ఆదివాసీ విద్యార్థి ఫోరం, ఆధార్ సొసైటీ, ఆదివాసీ మహిళా చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూని వర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ యువత ప్రభుత్వం చేపట్టే అనేక ఉపాధి పథకాలను వినియోగించుకుని ముందుకుపోవాలని సూచించారు. ఆదివాసీ తెగలు, సంస్కృతి, సంప్రదాయాలు నిలిచేలా ఆదివాసీలకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సాం ప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆర్ట్స్ కళాశాల నుంచి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌పీ విష్ణుమూర్తి, ట్రైకార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకర్‌రావు, ఓయూ అధ్యాపకులు చిడం కిశోర్‌కుమార్, గుమ్మడి అనురాధ, ఆల్ ఇండి యా రేడియో అధికారిణి కోడి నీలిమ పాల్గొన్నారు.

సింగరేణికాలనీలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో
ప్రపంచ గిరిజన దినోత్సవ సభ సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గిరిజన ప్రజాప్రతినిధులు, మేధావులు తమ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ఆశ్రయించారని, గిరిజనుల భాషా, వేషం, సంస్కృతి రక్షించటానికి అంతర్జాతీయ స్థాయిలో గిరిజన దినో త్సవాన్ని నిర్ణయించటం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో గిరిజన దినోత్సవాన్ని జరపాలని మేధావులు నిర్ణయం మేరకు పథ్నా లుగు దేశాలు అమోదం తెలిపి సంతకాలు చేశాయని, అందులో మనదేశం కూడా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యరద్శి గాంధీనాయక్, లచ్చిరాం బావోజీ శంకర్ నాయక్, రాంకోటి నాయక్, లాలూనాయక్, నాగార్జున నాయక్, గోపాల్ నాయక్, శ్రీను నాయక్, గోపి నాయక్, గ్రేటర్ హైదరాబాద్ సేవాలాల్ బంజార సంఘం అధ్యక్షులు రాంలాల్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. మరో సమావేశంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కుల దినంగా నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మనాయక్, బాలు నాయక్‌లు కోరారు.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...