మృతదేహం తీసుకరావొద్దు..


Fri,August 10, 2018 12:32 AM

-చనిపోయిన వ్యక్తిని కిరాయి ఇంటికి తీసుకరానివ్వని యజమాని
-నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు
-వానలో తడుస్తూ బజారులోనే..
-పోలీసుల జోక్యంతో నలుగురికి అనుమతి
అంబర్‌పేట,నమస్తే తెలంగాణ : ఇంట్లో కిరాయికి ఉం టున్న వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా యజమాని అడ్డుకున్నారు. ఈ ఘటన నల్లకుంట డివిజన్ తిలక్‌నగర్ శివాలయం ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకెళితే...నాగేశ్వరరావు(66) అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో తిలక్‌నగర్ పెద్ద గణేషుడి వీధి శివాలయం ప్రాంతంలో మల్లమ్మ, మంజుల ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. పదిరోజులుగా నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు. గురువారం గుండెపోటు రావడంతో మరణించాడు. అతడిని తాము అద్దెకు ఉంటున్న తిలక్‌నగర్‌లోని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకోగా.. ఇంటి యజమానురాలు మల్లమ్మ, మంజుల తీసుకురావద్దని అడ్డుకున్నారు. చేసేది లేక వారు నేరుగా అంబర్‌పేట శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు.

అనంతరం కుటుంబసభ్యులు ఇంటికిరాగా తాళం వేసి ఉంది. ఇదేమని అడుగగా, ఇంట్లోకి ఎవరూ వెళ్లవద్దని హుకుం జారీ చేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా వర్షంలోనే తడుస్తూ ఇంటి బయట కూర్చున్నారు. ఇది గమనించిన స్థానికులు కొందరు విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు చేరుకొని ఇంటి యజమానులను సముదాయించారు. చివరకు నలుగురు మాత్రమే వెళ్లాలని షరతు విధించారు. ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు.

299
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...