ట్రాఫికర్‌కి..బేఫికర్ సొల్యూషన్‌

Sun,July 22, 2018 11:59 PM

-ప్రత్యామ్నాయ మార్గాలతో పరిష్కారం
-ఆక్రమణల తొలిగింపుతో రద్దీ తగ్గుముఖం
-ఎస్‌ఆర్‌డీపీకితోడు లింకురోడ్లు తప్పనిసరి
-ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలపై నమస్తే క్షేత్రస్థాయి పరిశీలన

సిటీ న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ : నగర రోడ్లమీదికి నిత్యం సుమారు 1000కి పైగా కొత్త వాహనాలు వచ్చి చేరుతున్నాయి. పెరుగుతున్న వాహనాలకు తోడు, గ్రేటర్‌లో మెజార్టీ రహదారులు ఆక్రమణలకు గుర వ్వడంతో నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటున్నది. ప్రణాళికాబద్ధ కార్యాచరణతో ఈ సమస్యను పరిష్కరించుకో వచ్చంటున్నారు నగరవాసులు. ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలిగింపు, లింకురోడ్ల అభివృద్ధితో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టవచ్చం టున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ. 23వేల కోట్లతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)ని చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని 54జంక్షన్లలో ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న ప్రధాన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ లింకురోడ్ల నిర్మాణం చేపట్టింది. వీటితో పాటు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, రోడ్ల విస్తరణ, కబ్జాల తొలిగింపు ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చంటున్నారు. నమస్తే తెలంగాణ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో నగరవాసులు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు.

914

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles