తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు...పెరుగుతున్న ఆదరణ


Sun,July 22, 2018 11:52 PM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి:తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోం ది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో కేవలం ఒక నెల రోజుల్లోనే సుమారు 7,387 మంది ఈ సేవలను వినియోగించుకున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ దవాఖానలల్లోనే ఉచితంగా వైద్య పరీక్షలను చేయాలనే లక్ష్యంతో ప్రభు త్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విధితమే. ఈక్రమంలోనే మేడ్చల్ జిల్లా పరిధిలో ముందస్తుగా 14 పీహెచ్‌సీల్లో/ అర్బన్ హెల్త్ సెంటర్లలో 2018 జూన్ 18వ తేదీ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో సుమా రు 52 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తుండటంతో పాటు డాక్టర్ల సలహా మేరకు హెల్త్ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు ఉచితంగా చేయించుకునే వెసులుబాటు ఉండటం తో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నారాయణ రావు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచే...
తెలంగాణడయాగ్నసెంటర్లలో రక్త పరీక్షలకు సంబంధించిన నమూనాల సేకరణ ప్రతిరోజు ఉదయం 9గంటలకు షురూ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు శాంపిల్ సేకరణ జరిగిన తరువాత రెండు గంటల వరకు ప్రతి పీహెచ్‌సీల నుంచి ప్రత్యేక వా హనంలో శాంపిల్స్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ (ఐపీఎం) కేంద్రానికి తరలిస్తారు. నారాయణగూడలోని ఐపీఎంలోనే టెస్ట్‌లు చేసి రిపోర్టులను మెయిల్ చేస్తారని డీఎంఅండ్‌హెచ్‌వో తెలిపారు.

నిబంధనలు నిల్.. సేవలు ఫుల్
సాధారణంగా ఏదేని ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలంటే వాటికి కొన్ని నిబంధనలను విధించడం సహజం. కానీ తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లలో ఎలాంటి నిబంధనలు లేకుండానే వైద్యుల సూచనల మేరకు సుమారు 52రకాల వైద్య పరీక్షలను చేయించుకునే అవకాశం ఉందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వీటిలో ప్రధానంగా షుగర్ టెస్ట్, లిక్విడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షనింగ్, కంప్లీట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ పరీక్షలు, డెంగ్యూ, రీనల్ ఫంక్షన్, థైరాయిడ్, ఆర్థరైటిస్, ఈఎస్‌ఆర్ వంటి వైద్య పరీక్షలతో పాటు వీటిలో అనేక రకాలుగా ఉన్న సబ్ టెస్ట్‌లను కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తారని వైద్యలు పేర్కొంటున్నారు. అయితే షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలున్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకునేందుకు నిత్యం ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించి ఎక్కువ మొత్తంలో ఫీజులను చెల్లిస్తుంటారు. కానీ తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో మాతం నయా పైసా ఖర్చు లేకుండా, కఠినమైన నిబంధనలు లేకుండానే వైద్య 54 రకాల సేవలను పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌లోనే రిపోర్టులు...
సాధారణంగా ఏదేని ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో వైద్య పరీక్షలు చేయించినా.. వైద్య పరీక్షల రిపోర్టుల కోసం ఒకటి రెండు సార్లు తిరగాల్సిన పరిస్థితి.
కానీ తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో శాంపిల్ ఇచ్చి వెళితే చాలు, వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులలో చాలా వరకు కేవలం 24 గంటల్లోనే మెయిల్‌లో అందిస్తున్నారు. వీటిని ప్రింట్ తీసుకుని నేరుగా వైద్యునికి చూపించుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...