తెలంగాణ ఖ్యాతిని పెంపొందిస్తాం


Sun,July 22, 2018 11:51 PM

ఉప్పల్, (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రఖ్యాతిని పెంపొందించేవిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్‌తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్, రామంతాపూర్ డివిజన్‌లలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ, సీసీ, డ్రైనేజీల నిర్మాణ పనుల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్దతో రూ.26 వేలకోట్లతో బ్రిడ్జిలు, రద్దీప్రాంతాలలో ట్రాఫిక్ నివారణకు పనులు చేపడుతున్నామని తెలిపారు. మొదటివిడుతలో భాగంగా రూ.5 వేల కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేతి సుభాశ్‌రెడ్డి, కార్పొరేటర్లు స్వప్నాసుభాశ్‌రెడ్డి, అనలాహన్మంతరెడ్డి, జ్యోత్న్సనాగేశ్వర్‌రావు, సరస్వతి సదానంద్, డీసీ డా.ఎన్.యాదగిరిరావు, ఈఈ రాజయ్య, ఏఈలు, నేతలు హన్మంతరెడ్డి, నాగేశ్వర్‌రావు, సదానంద్, వెంకటేశ్వర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, ప్రవీణ్, మధుసూదన్‌రెడ్డి, గిరిబాబు,సుధాకర్, గోపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, సంతోశ్‌రెడ్డి, శివ, విక్రంరెడ్డి, పాపిరెడ్డి, సత్యరాజ్, నరేశ్, ప్రసాద్, భాస్కర్, విఠల్, అండాలు, స్వప్నా, నర్సింహారెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...