మల్లంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


Sun,July 22, 2018 11:49 PM

దుండిగల్,(నమస్తేతెలంగాణ): పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు సీహెచ్.మల్లారెడ్డి,కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శంభీపూర్‌రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండిమైసమ్మ-దుండిగల్ మండలం, మల్లంపేట గ్రామ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రూ.1కోటి50లక్షల నిధులతో గ్రామ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, వీకర్‌సెక్షన్‌లతో పాటు వివిధ బస్తీల్లో సీసీరోడ్డు, భూగర్భడ్రైనేజీ నిర్మాణ పనులు, మహేశ్వరంలో కమిటిహాల్, భూగర్భడ్రైనేజీ నిర్మాణపనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి,గ్రామసర్పంచ్ అనంతస్వామి, ఎంపీటీసీ వెంకటేశం, వార్డుసభ్యులు స్వప్న, లక్ష్మి, నర్సమ్మ, హన్మంత్‌రావు, బాలకృష్ణ, మంజుల, విశ్వేశ్వరరావు, శ్రీనివాస్, శంకర్, వరలక్ష్మీలతో పాటు నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...