ప్రేమ పేరుతో... లైంగికదాడి


Sun,July 22, 2018 11:46 PM

-పెండ్లి ప్రస్తావన రాగానే దూరం
-యువతి ఫిర్యాదుతో కేసు నమోదు
మన్సూరాబాద్ : ప్రేమిస్తున్నాను.. పెండ్లి కూడా చేసుకుంటానంటూ నమ్మిం చి.... ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసుల కథనం ప్రకారం ... ఎల్బీనగర్, బైరామల్‌గూడకు చెందిన పి. సుధాకర్‌గౌడ్ (28) మిల్క్‌డెయిరీలో పని చేస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న సమయంలో.... అదే కళాశాలలో చదివే సైదాబాద్ ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఇంటర్ అనంతరం వారు వేరు వేరు ప్రాంతాల్లో చదువుకోవడంతో ఇరువురి మధ్య స్నేహ సంబంధాలు దూరమయ్యాయి. 2015లో సుధాకర్‌గౌడ్ ఫేస్‌బుక్‌లో సదరు యువతితో స్నేహం చేశాడు. ఈ క్రమంలో సదరు యువతిని ప్రేమలోకి దించాడు. పెండ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో బైరామల్‌గూడలోని రూంలో యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల యువతి పెండ్లి ప్రస్తావన తీసుకురాగా.. తప్పించుకుతిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...