సైనికుల దేవుడు సీఎం కేసీఆర్


Sun,July 22, 2018 12:02 AM

బషీర్‌బాగ్ : సైనికుల దేవుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి అన్నారు. దేశరక్షణ కోసం ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న సైనికులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఉన్నత పదవులు కట్టబెట్టుడుతున్నారని వెల్లడించారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సమాఖ్య ఆధ్వర్యంలో పన్యాల భూపతిరెడ్డిని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌తోపాటు, మాజీ సైనికులు గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సభలో చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, సైనికులు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సైనికుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సైనికులకు రావాల్సిన అన్ని బెన్‌ఫిట్‌లు అందేలా కృషి చేస్తానని హామీఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను గుర్తించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని కాపాడే వృత్తి ఎంతో గొప్పదని, దేశరక్షణ కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండాఎదురొడ్డి పోరాడే వ్యక్తి జవాన్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైనికుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, వెయ్యి కోట్లు కేటాయించారని.. వెనుకబడిన వర్గాలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైనికుల కుటుంబాల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించిందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికోద్యోగులు తాడూరి శ్రీనివాస్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షుడు పరెడ్డి మనోహర్‌రెడ్డి, రీజినల్ సైనిక వెల్ఫేర్ అధికారి నరోత్తం,మాజీ సైనికోద్యోగులు శంకర్‌రెడ్డి, శ్రీనేశ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, కర్నల్ రమేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...