భవిష్యత్తు మేళా


Sat,July 21, 2018 11:58 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభు త్వం చేయూతనిస్తున్నది. జాబ్‌మేళాలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. రెండు సంవత్సరాలకోసారి క్యాంపస్ నియామకాల పద్ధతిలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ వారికి భవిష్యత్తునిస్తున్నది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సహకారంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా కేంద్రంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వృతి విద్యా కోర్సు అభ్యర్థులకు గత శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకే కాకుండా ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు కూడా అవకాశా లు కల్పిస్తున్నాయి. ఈ బాధ్యతను ఆయా జిల్లాల్లోని అధికారులే నిర్వర్తి స్తున్నారు.

ఇప్పటి వరకు 2155 మందికి..
పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులతోనే సరిపెట్టుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా రు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేళాలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1570 మందికి 25 కంపెనీలు ఉద్యోగ అవకాశం కల్పించాయి. ఈ జాబ్ మేళా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే 2వ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 2015-16, 2016-17, 20 17-18 విద్యా సంవత్సరానికి చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పిం చా రు. 1200 మంది అభ్యర్థులు జాబ్‌మేళా కు హాజరయ్యారు. వీరిలో 655 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం లభించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ పద్ధతిలో ఉచిత టిఫిన్, భోజనంతో పాటు గౌరవ వేతనం ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 2,155 మందికి ఉద్యోగ అవకాశం కల్పించారు.
ముందుకొచ్చిన కంపెనీలు
రెండో జాబ్‌మేళాలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, -100(ఎలక్ట్రికల్) మంది అభ్యర్థులను, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్-100, భారత్ డైనమిక్స్ లిమిటెడ్-130, అడెకో గ్రూప్-100, మైక్రోమాక్స్-105, కబ్‌సన్స్ గ్యాస్ ఎక్యూప్‌మెంట్స్ లిమిటెడ్-10, ఏపీ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-50, పాల్మన్ లిమిటెడ్-10 మంది అభ్యర్థుల ను ఉద్యోగాలకు ఎంపికచేసుకున్నారు.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...