గచ్చిబౌలి టు మియాపూర్ ట్రాఫిక్..బేఫికర్

Sat,July 21, 2018 01:21 AM

-బొటానికల్ గార్డెన్స్ నుంచి 3 కిలోమీటర్ల ైఫ్లెఓవర్
-కొత్తగూడ జంక్షన్ వద్ద అండర్ పాస్
- కీలక మలుపుల్లో గ్రేడ్ సెపరేటర్లు
-రూ.263 కోట్ల వ్యయం
- వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా నిర్మాణం పూర్తి
-పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి
-శాశ్వత పరిష్కార ప్రయత్నంలో తాత్కాలిక ఇబ్బందులు తప్పవు - అందువల్లే గుంతలు
-విశ్వనగరం కోసం సహకరించండి
- మ్రంతి కేటీఆర్ విజ్ఞప్తి
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ. 23వేలకోట్లతో 54 జంక్షన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కొండాపూర్‌లో రూ. 263కోట్ల వ్యయంతో చేపడుతున్న మల్టీలెవల్ ైఫ్లెఓవర్ నిర్మాణ పనులకు మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూనే ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నామన్నారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతున్నదన్నారు. మరెక్కడా లేని విధంగా పెద్దఎత్తున అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేపట్టామన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య అధికమవుతుందన్నారు. నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు, ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

అనంతరం ఆయా ప్రాజెక్టుల గడువును సభాముఖంగా ప్రకటించారు. ఎస్‌ఆర్‌డీపీ పనుల పురోగతి వివరాలను వెల్లడించారు. ప్రాజెక్టు మొదటిదశలో భాగంగా రూ. 3000కోట్ల పనులు ఇప్పటికే కొనసాగుతుండగా, రూ. 2350 కోట్ల పనులు టెండర్ల దశలో, మరో రూ. 2686 కోట్ల విలువైన పనులు మంజూరు దశలో ఉన్నట్లు తెలిపారు. ఐదు ప్రాజెక్టులు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇందులో మైండ్‌స్పేస్ జంక్షన్ వచ్చే ఆగస్టు, రాజీవ్‌గాంధీ విగ్రహం ైఫ్లెఓవర్ డిసెంబర్, కామినేని ఎడమ వైపు ైఫ్లెఓవర్ ఈనెల చివరినాటికి, ఎల్బీనగర్ ఎడమవైపు ైఫ్లెఓవర్ సెప్టెంబర్, ఎల్బీనగర్ ఎడమవైపు అండర్‌పాస్ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తవుతాయని మంత్రి వివరించారు.రోడ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, మంచినీటి సరఫరా పైప్‌లైన్ల ఏర్పాటు, టెలికాం కేబుళ్లు, విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు, మెట్రో పనులు, ైఫ్లెఓవర్ల పనులు తదితర పనుల కోసం భారీగా తవ్వకాలు అనివార్యం కావడంతో రోడ్ల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. అయినా ప్రజలకు ఇబ్బంది కాకుండా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నామన్నారు.

ఏండ్ల తరబడి సమస్యకు పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏండ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు మల్టీలెవల్ ైఫ్లెఓవర్‌తో పరిష్కారం లభిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ైఫ్లెఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఐటీ కారిడార్ విస్తరించిన శేరిలింగంపల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో శేరిలింగంపల్లి విశేష పురోగతి సాధిస్తున్నదని, ఎక్కడలేని విధంగా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్, బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్, ఎస్‌ఆర్‌డీపీ చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, శేరిలింగంపల్లి సర్కిల్ ఉపకమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్లు హమీద్‌పటేల్, జగదీశ్వర్‌గౌడ్, పూజిత గౌడ్‌లు తదితరులు పాల్గొన్నారు.

పూర్తయినవి, కొనసాగుతున్న పనులు, వ్యయం .

మైండ్‌స్పేస్ బయోడైవర్సిటీ కారిడార్- రూ. 379 కోట్లు
- అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్- ప్రారంభం
- మైండ్‌స్పేస్ అండర్‌పాస్- ప్రారంభం
- మైండ్‌స్పేస్ ైఫ్లెఓవర్- ఆగస్టు, 2018
- బయోడైవర్సిటీ ైఫ్లెఓవర్- మార్చి, 2019
- రాజీవ్‌గాంధీ విగ్రహం ైఫ్లెఓవర్- డిసెంబర్, 2018
ఎల్బీనగర్ కారిడార్-రూ.448కోట్లు...
-చింతలకుంట అండర్‌పాస్- ప్రారంభం
- కామినేని ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్) ైఫ్లెఓవర్- జూలై, 2018
- ఎల్బీనగర్ ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్) ైఫ్లెఓవర్- సెప్టెంబర్, 2018
- ఎల్బీనగర్ ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్) అండర్‌పాస్- డిసెంబర్, 2018
- బైరామల్‌గూడ ఎడమవైపు(ఎల్‌హెచ్‌ఎస్) ైఫ్లెఓవర్- మార్చి, 2019
- ఎల్బీనగర్ కుడివైపు(ఆర్‌హెచ్‌ఎస్) ైఫ్లెఓవర్- జూన్, 2019
- కామినేని కుడివైపు(ఆర్‌హెచ్‌ఎస్) ైఫ్లెఓవర్- మార్చి, 2019
- దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి- రూ. 184కోట్లు - మార్చి, 2019
- రోడ్ నెం-45 ఎలివేటెడ్ కారిడార్- రూ. 150కోట్లు - సెప్టెంబర్, 2019
- షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్- రూ. 333.55కోట్లు - డిసెంబర్, 2019
- కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్- రూ. 263.09కోట్లు - డిసెంబర్, 2019
- బాలానగర్ గ్రేడ్ సెపరేటర్- రూ. 387కోట్లు - సెప్టెంబర్, 2019
- ఓవైసీ వైద్యశాల, బహదూర్‌పుర ైఫ్లెఓవర్- రూ. 132కోట్లు - సెప్టెంబర్, 2019
- అంబర్‌పేట్ ఛే నెంబర్ ైఫ్లెఓవర్- రూ. 270కోట్లు -డిసెంబర్, 2019
- కేబీఆర్ పార్కు చుట్టూ ైఫ్లెఓవర్లు- రూ. 436కోట్లు - పనులు ప్రారంభం కావాల్సి ఉంది
టెండర్ ప్రక్రియలో ఉన్న పనుల వివరాలు....
- ఇందిరాపార్కు-వీఎస్‌టీ స్టీలు బ్రిడ్జి- రూ. 426కోట్లు
- సైబర్ టవర్స్ ఎలివేటెడ్ రోటరీ ైఫ్లెఓవర్- రూ. 225కోట్లు
- రేతిబౌలి నానల్‌నగర్ ైఫ్లెఓవర్- రూ. 175కోట్లు
- శిల్పాలేఔట్-గచ్చిబౌలి ైఫ్లెఓవర్- రూ. 330కోట్లు
- నల్గొండ క్రాస్‌రోడ్-ఓవైసీ హాస్పిటల్ ైఫ్లెఓవర్- రూ. 523.37కోట్లు
- జూపార్క్-ఆరాంఘర్ ైఫ్లెఓవర్- 636.80కోట్లు
- చాంద్రాయణగుట్ట ైఫ్లెఓవర్ విస్తరణ- రూ. 37.00కోట్లు
మంజూరు దశలో ఉన్న పనులు....
- ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్- రూ. 875కోట్లు
(ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది)
- ఉప్పల్ క్రాస్‌రోడ్ ైఫ్లెఓవర్- రూ. 311కోటు ్ల(ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉంది)
- జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో రూ. 1500కోట్లతో మరో మూడు ఎలివేటెడ్ కారిడార్లు

855

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles