ప్రతి మొక్కకో లెక్కుంది!


Sat,July 21, 2018 01:09 AM

మేడ్చల్ రూరల్ : మానవ జాతి ప్రాణదాతువైన వృక్ష సంపదపై ప్రేమ ఉండనిది ఎవరికి? ప్రాణి కోటి జీవితాల్ని నిలపడంలోనే కాదు.. పర్యావరణ సమతుల్యతలోనూ మొక్కలు కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి మొక్కల్లో కొన్ని వైద్య విలువలను కలిగి ఉంటాయి. ఇంకొన్ని నీడను, పండ్లను, కలపను ఇస్తాయి. అందుకే... మొక్కలను పెంచడం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరిది బాధ్యత. దీన్ని గుర్తెరిగిన రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనంపై ప్రత్యేక దృషి ్టసారించింది. బహిరంగ ప్రదేశాలు మొదలు ఇండ్లు, పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, గేటేడ్ కమ్యూనిటీల్లో మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రజల్లో మొక్కల పెంపకం పట్ల అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని ప్రేమిస్తున్నారు. తమ పరిసరాల్లో రకరకాల మొక్కలను పెంచుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
సాధారణంగా కనిపించే వేప, చింత, బాదం, మర్రి తదితర మొక్కలతో పాటు ప్రత్యేక లక్షణాలు గల మొక్కల ఎంపికపై నగరవాసుల్లో ఇప్పుడు ఆసక్తి పెరుగుతున్నది. దీంతో నగరాన్ని ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లాలోని పలు గ్రామీణ మండలాల్లో పదుల సంఖ్యలో నర్సరీలు వెలుస్తున్నాయి. నర్సరీల్లో రకరకాల దేశ, విదేశీ మొక్కలు లభిస్తున్నాయి.

దేవగన్నేరు
దేవ గన్నేరు వేగంగా పెరుగుతుంది. అందమైన తెల్లని పూలు పూస్తాయి. పూల మధ్యలో బంగారు వర్ణం మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. తెలుపుతో పాటు గులాబీ, ఎరుపు వర్ణాల్లోనూ పూలు పూస్తాయి. ఒక్కో పుప్వు 5 నుంచి 7.5 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగి ఉంటుంది. పూజతో పాటు అలంకరణకూ ఈ పూలను ఉపయోగిస్తారు. చైనా సంప్రదాయ ఔషధంగా వీటిని వినియోగిస్తారు. ఇది 15 ఫీట్ల ఎత్తు వరకు పెరుగుతుంది.

ఆరేలియా
ఆరేలియాను అలంకరణ మొక్కగా ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. వీటి ఆకులు అందంగా, ఆకర్శణీయంగా ఉంటాయి. ఈ మొక్కలతో అహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. బంగారు, తెలుపు, ఆకుపచ్చ తదితర రంగులతో ఈ మొక్కలు లభిస్తాయి.

పెన్సిల్‌పైన్(ఆంథ్రోటాక్సిస్ కూప్రెసాయిడెస్)

పెన్సిల్‌పైన్ నిటారుగా పెరుగుతుంది. తక్కువ మందంతో 15 ఫీట్ల వరకు ఎదుగుతుంది. ఒకదాని పక్కన ఒకటి పెంచుకుంటూ పోతే రోడ్డు పక్కన అందంగా కన్పిస్తాయి. దారిలో పెట్టుకుంటే స్వాగతం పలుకుతున్నట్టు కన్పిస్తాయి. ఇండ్ల ముందున్న ఖాళీ స్థలం, పార్కుల్లో ఆహ్లాదం కోసం పెంచుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ మొక్కను పెంచుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

130
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...