అంతర్గత రోడ్ల పనులు పూర్తి చేయాలి


Fri,July 20, 2018 02:14 AM

కేపీహెచ్‌బీ కాలనీ: వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. గురువారం కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో అరవింద్‌కుమార్, నగర కమిషనర్ జనార్దన్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ శంకరయ్యలు జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్ల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అరవింద్‌కుమార్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి ప్రవాహానికి రోడ్లు దెబ్బతినడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముందన్నారు. వర్షాకాలంలో విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను సిద్ధం చేయాలన్నారు. నగరంలో హరితహారాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కూకట్‌పల్లి జోనల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని ముళ్లకత్వ చెరువు నర్సరీని, ఆల్విన్‌కాలనీ డివిజన్‌లోని ధరణీనగర్ నాలాను పరిశీలించారు. కార్యక్రమంలో మూసాపేట, కూకట్‌పల్లి, గాజులరామారం, అల్వాల్, కుత్బుల్లాపూర్ సర్కిళ్ల ఉప కమిషనర్లు, ఈఈలు, ఏఎంహెచ్‌వోలు, ఏసీపీలు, బయో డైవర్సిటీ మేనేజర్లు, ఏఈలు పాల్గొన్నారు.

228
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...